‘ధమాకా’తో ఓ సూపర్ హిట్ కొట్టాడు త్రినాథరావు నక్కిన. ఈ సినిమా తరవాత దర్శకుడిగా తనపై నమ్మకం మరింత పెరిగింది. ఇప్పుడు సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్నాడు. దీని కోసం ‘మజాకా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. త్రినాథరావు చేయబోయే తదుపరి సినిమాపై కూడా ఓ స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. త్వరలో ఆయన గోపీచంద్ తో ఓ సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Also Read : గోపీచంద్ ‘సినిమా’ కష్టాలు
భగవాన్, పుల్లారావు ఇప్పటికే నక్కినకు అడ్వాన్స్ ఇచ్చేశారు. వాళ్ల దగ్గర గోపీచంద్ డేట్లు ఉన్నాయి. అలా.. ఈ కాంబో సెట్టయ్యింది. ప్రస్తుతానికి గోపీచంద్ కి సరిపడా కథ కోసం అన్వేషణలో పడ్డాడు త్రినాథరావు. ‘మజాకా’ షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయ్యింది. రావు రమేష్ కీలక పాత్రధారి. ఈ యేడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరవాతే గోపీచంద్ సినిమా పట్టాలెక్కుతుంది. గోపీచంద్ ప్రస్తుతం శ్రీనువైట్ల తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘విశ్వమ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. సెప్టెంబరులో ఈ చిత్రం విడుదలయ్యే ఛాన్సుంది. ప్రస్తుతానికి గోపీచంద్ చేతిలో ఉన్న సినిమా ఇదొక్కటే.