రెండుసార్లు సీఎం… మూడోసారి గెలుస్తామన్న నమ్మకం తనకు, తన పార్టీకి ఉన్నా… ప్రజలకు నమ్మకం కుదరలేదు. ఓడించి, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు.
గెలిచినా, ఓడినా ప్రజాస్వామ్యంలో నేతలు అసెంబ్లీకి హజరవ్వాల్సిందే. కామారెడ్డిలో ఓడిపోయినా… గజ్వేల్ ప్రజలు కేసీఆర్ ను గెలిపించి, అసెంబ్లీకి పంపారు. అందుకైనా ఆయన రావాల్సిందే. పైగా ప్రతిపక్ష నేతగా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి అసెంబ్లీకి రావాల్సిందే.
కానీ, కేసీఆర్ ఇప్పటి వరకు రాలేదు. డిసెంబర్ లో ఎన్నికలు అయితే దాదాపు ఏడు నెలల పూర్తి కావొస్తుంది. మొదట్లో గాయం కారణంగా డుమ్మా కొట్టినా, ఆ తర్వాత కూడా ఆయన అసెంబ్లీకి దూరంగానే ఉన్నారు. దీంతో ప్రభుత్వం అవకాశం దొరికిన ప్రతిసారి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అని సవాల్ విసురుతున్నా ఆయన స్పందించలేదు.
ఫైనల్ గా బడ్జెట్ పెడుతున్న సమయంలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం, సభ వాయిదా పడటం రొటీన్. ప్రతిపక్ష నేతగా బడ్జెట్ పెట్టే సమయంలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఉండదు. అయినా కేసీఆర్ సభకు వస్తున్నారు.
కానీ ఇప్పుడు మీడియాకు ఇది కూడా వార్తే అయ్యింది. కేసీఆర్ ఇంట్లో నుండి బయలుదేరే దగ్గర నుండి అసెంబ్లీ వరకు లైవ్ కవరేజ్…. బాగుంది. ఆయన రాకపోతే వార్త అయ్యే పరిస్థితి నుండి వస్తే వార్త అయ్యే వరకు వచ్చింది పరిస్థితి.