యూట్యూబర్లపై ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్దమవుతోందని ఇందు కోసం ప్రత్యేకమైన బిల్లును తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇలా ఆంక్షలు తెస్తే అది వాక్ స్వేచ్చపై దాడేనని కొంత మంది వాదిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మరికొంతమంది అంటున్నారు. కానీ సోషల్ మీడియాకు ఎలాంటి ఆంక్షలు లేని ఫలితంగా ఏర్పడుతున్నపరిణామాలు చూస్తే యూట్యూబర్లకు ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటారు.
ఇతరుల వ్యక్తిగత జీవితాలపై బురద చల్లికాసులు పంపాదించుకుంటున్న యూట్యూబర్లు
యూట్యూబ్ ఓపెన్ చేస్తే… థంబ్ నెయిల్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటివి చూసిన వారికి ఆసక్తి అనిపిస్తుందేమో కానీ ఎవరిని టార్గెట్ చేశారో వారికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇప్పటి వరకూ ఎంత మందిని యూట్యూబ్ న్యూస్‌లలో చంపారో.. ఎంత మందిని ఆస్పత్రి పాలు చేశారో చెప్పాల్సిన పని లేదు. ఆ మానసిక వేదన పడేవారికి తెలుస్తుంది. బతికే ఉన్నాను మహా ప్రభో అని.. వారు ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇలాటివి చెప్పుకుంటే పెద్ద చరిత్ర అవుతుంది. యూట్యూబ్‌లో 90 శాతం ఇలాంటి చెత్తే ఉంటుంది.
Read Also :యూట్యూబ్ చానళ్ల తీరుపై కేటీఆర్ ఆగ్రహం !
ఫేక్ న్యూస్‌ల కోసమే వందల కొద్దీ చానళ్లు
మామూలు టీవీ చానల్ పెట్టాలంటే సవాలక్ష అనుమతులు తీసుకోవాలి. కానీ యూట్యూబ్ పెట్టుకోవాలంటే. ఒక్క ఈమెయిల్ చాలు. అది ఫేక్ అయినా పర్వాలేదు. ఈ చాన్స్ తోనే విరుచుకుపడుతున్నారు. ఫేక్ అకౌంట్లతో చానల్స్ పెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు వార్తలు ప్రచారం చేసేస్తున్నారు. దాన్ని వాక్ స్వేచ్చగా చెప్పుకుంటున్నారు. నిజానికి వాక్ స్వేచ్చకూ హద్దులున్నాయి. తప్పుడు ప్రచారం చేయడం.. వేరే వారికి కుటుంబాలపై ఇష్టం వచ్చిటన్లుగా వ్యాఖ్యలు చేయడం వాక్ స్వేచ్చ కాదు.
రెగ్యులేటరీ ఉండాల్సిందే !
దేనికైనా రెగ్యులేటరీ ఉండాలి. ముఖ్యంగా ప్రజలకు సమాచారం అందించే వాటి విషయంలో రెగ్యులేటరీ ఉండాల్సిందే. లేకపోతే గందరగోళ పరిస్థితులు వస్తాయి. ప్రభుత్వాలను విమర్శించే వారినే కట్టడి చేయడానికి ఇలాంటి చట్టాలుతీసుకు వస్తే నిర్మోహమాటంగా వ్యతిరేకిచాల్సిందే. కానీ… సమాజాన్ని కలుషితం చేసేవారిని కంట్రోల్ చేయాలని నిజాయితీగా అనుకుంటే .. అటువంటి ఆంక్షల్ని మాత్రం స్వాగతించాల్సి ఉంటుంది.