తెలుగు సినిమాల్లో ఈమధ్య కామెడీ బాగా తగ్గిపోయిందండీ..
– మరేం ఫర్వాలేదు. ఈ ఎన్నికలలో బోల్డంత లైవ్ కామెడీ చూడొచ్చు.
అవును. ఈసారి ఎన్నికలలో కమెడియన్లు మైకులు పట్టుకుని దంచి కొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇంచు మించుగా ప్రతీ పార్టీలోనూ హాస్యనటుల హంగామా కనిపించబోతోంది. అలీ, పోసాని, నాగబాబు, ఫృథ్వీ, షలకల శంకర్, కృష్ఱుడు… ఇలా పేరెన్నదగిన హాస్యనటులు తమ పార్టీల తరపున ప్రచారం చేయబోతున్నారు. అలీ గుంటూరు టికెట్ ఆశించి భంగపడ్డాడు. జగన్ ఇది వరకే… ఆ సీటుపై మాట ఇచ్చేయడం వల్ల అలీ ఈసారి ఎన్నికలలో పోటీ చేయడం లేదు. కేవలం ప్రచారానికే పరిమితం. ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే చోట అలీతో ప్రచారం చేసి లాభపడాలని వైకాపా భావిస్తోంది. అలీ కంటే ముందు పోసాని, ఫృథ్వీ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. పోసాని ఏం మాట్లాడినా సెటైరికల్‌గానే ఉంటుంది. స్పీచుల్లో ఆయన్ని మించినోడు లేడు. ఇక ఫృథ్వీ ఈమధ్య ఫైర్ బ్రాండ్‌గా మారిపోయాడు. ఎవరినైనా సరే ఉతికి ఆరేస్తున్నాడు.
జనసేన తరపునా కొంతమంది కమెడియన్లు ప్రచారం చేయబోతున్నారని టాక్. నాగబాబు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చేసుకుని టీడీపీపై సెటైర్లు వేస్తున్నాడు. షకలక శంకర్ కూడా శ్రీకాకుళం ఏరియాలో ప్రచారం చేయడానికి రెడీ అయ్యాడట. పవన్ అంటే ఇష్టంతో కొంతమంది హాస్యనటులు.. జనసేనకు ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎటొచ్చీ.. కమెడియన్ల హంగామా లేని పార్టీ టీడీపీనే. ఒకప్పుడు ఏవీఎస్ లాంటి హాస్య నటులు టీడీపీకి ప్రచారం చేసి పెట్టారు. ఇప్పుడు మాత్రం ఆలోటు స్పష్టంగా కనిపిస్తోంది.