హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిపై తెలుగుదేశం ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నెల 24న రాహుల్ ఏపీలోని అనంతపురం జిల్లాలో పర్యటనకు రానున్నారన్న వార్తలపై స్పందిస్తూ గాలి ఈ వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి ఏ ముఖం పెట్టుకుని ఏపీలో పర్యటిస్తారని ప్రశ్నించారు. ఆయన వస్తే రాష్ట్రం అపవిత్రమవుతుందన్నారు. రాహుల్ ముందుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి ఏపీలో తిరగాలని డిమాండ్ చేశారు. రాహుల్ ముఖం చూడటానికి రాష్ట్ర ప్రజలు ఇష్టపడటంలేదని, అందుకు తార్కాణం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు రాకపోవటమేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు దగాపడ్డారని గాలి అన్నారు.