బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ‘గం గం గణేశా’ సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు. కథని కాకుండా కథా నేపధ్యాన్ని రివిల్ చేస్తూ ట్రైలర్ సాగింది. దొంగ తనాలు చేసే హీరో, డబ్బులు పంచి ఎలక్షన్ లో నెగ్గాలనుకునే ఓ రాజకీయ నాయకుడు, వినాయక ఉత్సవాలని వైభవంగా జరించలనుకునే ఓ రాజావారు, విగ్రహం కాజేయాలని ఓ గ్యాంగ్ ప్రయత్నం.. ఈ నాలుగు ట్రాకులు ఎలా కలుస్తాయి? హీరో దొంగతనం ఎందుకు కోసం ? అనేది అసలు పాయింట్.
ట్రైలర్ లో క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్ బాగానే కుదిరాయి. హీరో పాత్ర నవ్వించేలానే వుంది. చైనా భాషలో టాటూ చూపించి అందర్నీ బురిడికొట్టించడం పేలింది. ఆనంద్ టైమింగ్ గమ్మత్తుగానే వుంది. కథలో రొమాంటిక్ కోణం కూడా వుంది. సత్య రాజేష్ మరోసారి కామెడీ పాత్రలో కనిపించారు. ఇమ్మన్యుల్ కి కూడా కీలక పాత్ర దొరినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. వినాయక చవితి ఉత్సవాల చుట్టూ కథ తిరగడం టైటిల్ జస్టిఫికేషన్ అనుకోవాలి. నేపధ్య సంగీతం, కెమరాపనితనం డీసెంట్ గానే వున్నాయి. బేబీ తర్వాత ఆనంద్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కొంత బజ్ వుంది. ఈ మధ్య కాలంలో చాలా క్రైమ్ కామెడీలు వచ్చాయి కానీ ప్రేక్షకులు ఆదరణకు నోచుకోలేదు. మరి ఈ సినిమా ఫలితం ఎలా వుంటుందో చూడాలి. మే31న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.