కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా… వైసీపీ నేతలు..” కౌంటింగ్ డే ” ప్లాన్స్ అమలు చేస్తున్నారన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ప్రారంభమయింది. ఫలితాల రోజు ఉద్రిక్తతల కోసమే… వంశీని టార్గెట్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీ ఎప్పుడూ గొడవల్లో… ఉన్నట్లుగా వివాదాలు రాలేదు కానీ.. ఆయన.. పరిటాల రవి అనుచరునిగా మాత్రం.. అందరికీ తెలుసు. ఆ ఇమేజ్ కారణంగానే గన్నవరం నియోజకవర్గం కేంద్రంగా వైసీపీ.. ఆఫ్టర్ పోలింగ్ ప్లాన్లు అమలు చేస్తున్నారని బలమైన ప్రచారం ఊపందుకుంటోంది. నిజానికి రాజకీయంగా గన్నవరం నియోజకవర్గం ఉద్రిక్తమైనది కాదు. అక్కడ ఎప్పుడూ గొడవలు జరిగిన దాఖలాలు కూడా లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి .. బలమైన స్థానం కూడా కాదు. అభ్యర్థి కోసం.. చివరి వరకూ వెదుక్కునే పరిస్థితి వైసీపీ ఉంది. డబ్బు బలం ఉందన్న కారణంగా… ఎన్నారైగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావును వైసీపీ ఎంచుకుంది. ఆయనకు… కొడాలి నాని సపోర్ట్ ఉంది.
కొడాలి నాని… సాన్నిహిత్యమో… అదే రాజకీయం అనుకున్నారో కానీ… గన్నవరం బరిలో దిగినప్పటి నుంచి వంశీపై తీవ్ర పదజాలంతో ఆరోపణలు చేస్తూ..వెంకట్రావు గ్రామాల్లో ప్రచారం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత గ్రామాల్లో… వైసీపీ నేతలు హడావుడి చేయడం ప్రారంభించారు. తామే గెలుస్తున్నామంటూ.. టీడీపీ నేతల్ని..రెచ్చగొట్టి..గొడవలు రేపేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. వంశీ… రాజకీయాల్లో వ్యక్తిగత శత్రుత్వం మంచిది కాదన్న ఉద్దేశంతో యార్లగడ్డ వెంకట్రావుతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇలాంటి పరిస్థితి కోసమే ఎదురు చూస్తున్నారో లేక..నిజంగానే.. వంశీని చూసి భయపడ్డారో కానీ… వైసీపీ నేతలు.. నేరుగా పోలీసుల వద్దకు వెళ్లారు. అప్పట్నుంచి.. వంశీ వీలైనంతగా.. సంయమనం పాటించి.. ప్రకటనలు చేస్తున్నా … వైసీపీ నేతలు మాత్రం… కాస్త ఘాటు ప్రకటనలే చేస్తూ వస్తున్నారు. తమ మాటల్లో బెదిరింపులే లేవని.. వంశీ చెబుతూండగా… తాటాకు చప్పుళ్లకు భయపడబోనని.. యార్లగడ్డ సవాల్ చేస్తున్నారు. అంటే.. ఈ వివాదాన్ని వైసీపీ నేతలు అంతకంతకూ పెంచుకుంటూ పోయే ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.
నిజానికి పోలింగ్ ముందు కూడా.. వల్లభనేని వంశీపై.. ఇలాంటి వివాదాలు వచ్చాయి. అయితే.. అంతకు ముందు బెదిరింపులను.. స్వయంగా వంశీ ఎదుర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా గన్నవరం నియోజకవర్గంలో.. పూర్తి స్థాయి పట్టు సాధించిన వంశీని… టీడీపీ తరపున పోటీ చేయకుండా… బెదిరించారనే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు పోలింగ్ తర్వాత కూడా ఆయనని టార్గెట్ చేస్తున్నారు. రాజకీయం ఏదైనా కానీ.. ఇంత వరకూ ఎప్పుడూ.. దాడుల రాజకీయం.. ఉద్రిక్తలు లేని గన్నవరంలో మాత్రం.. పరిస్థితి మారిపోయింది. ఎవరి స్కెచ్ ఏమిటో కానీ.. రాజకీయ కక్షలు పెరుగుతున్నాయి. ఈ రచ్చ వెనుక అసలు ప్లాన్ కౌంటింగ్ డే రోజున బయటపడే అవకాశం కనిపిస్తోంది.