యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరో గా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం” . ప్రస్తుతంజార్జియాలో ఎంగురి డ్యామ్‌లో ఇప్పుడు గరుడ వేగ టీం సందడి చేస్తుంది. జార్జియా దేశానికి మూడొంతులు పైగా ఎలక్ట్రిసిటీ, తాగునీటిని సరఫరా చేసే డ్యామ్ ఇది. జార్జియా పశ్చిమాన ఉన్న ఈ డ్యామ్ ప్రపంచంలోనే 6వ ఎత్తైన (271.5 మీ లేదా 891 అడుగులు) డ్యామ్. ఈ ప్రాంతంలో ఏడు రోజుల పాటు యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరణ జరుపుతున్నారు. పారాచ్యూట్స్, మిలటరీ విమానాలు, ఎం-16 మెషీన్స్ సహా భారీగా పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు. జార్జియా అధికారులు, డ్యామ్ అధికారులు యూనిట్‌కు సహకారం అందిస్తున్నారు. డ్యామ్ చీఫ్ ఇన్చార్జి జాన్ ఛనియా దగ్గరుండి పర్యవేక్షిస్తుండటం విశేషం. అంతే కాకుండా 4 డిగ్రీల చలిలో ముప్పై మైళ్ళ వేగంతో గాలులు వీస్తుంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా యూనిట్ సభ్యులు ఎంతో కష్ట నష్టాలకోర్చి సినిమా షూటింగ్ చేస్తున్నారు.
రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పూజా కుమార్ గృహిణి పాత్రలో నటిస్తుంది. జార్జ్ అనే కరుగుగట్టిన విలన్ పాత్రలో కిషోర్ సహా నాజర్, పోసాని కృష్ణమురళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, శత్రు, సంజయ్ స్వరూప్, రవివర్మ, ఆదర్శ్, చరణ్ దీప్, రవి రాజ్ తది తరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేకప్ః ప్రశాంత్, ప్రొడక్షన్ మేనేజర్స్ః శ్రీనివాసరావు పలాటి, సాయి శివన్ జంపన, లైన్ ప్రొడ్యూసర్ః మురళి శ్రీనివాస్, కాస్ట్యూమ్స్ డిజైనర్ః బాబీ అంగార, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజన్ః సి.వి.రావ్(అన్నపూర్ణ స్టూడియోస్), స్టంట్స్ః సతీష్, నుంగ్, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫర్ః విష్ణుదేవా, ఎడిటర్ః ధర్మేంద్ర కాకరాల, రచనః ప్రవీణ్ సత్తారు, నిరంజన్ రామిరెడ్డి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః శ్రీచరణ్ పాకాల, సమర్పణః శివాని శివాత్మిక ఫిలింస్, నిర్మాణంః జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్రఫీః అంజి, సురేష్ రగుతు, శ్యామ్ ప్రసాద్, గికా, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచరణ్ పాకాల, ప్రొడ్యూసర్ః ఎం.కోటేశ్వర్ రాజు, కథ, కథనం, దర్శకత్వంః ప్రవీణ్ సత్తారు.