గోపీచంద్ కి హిట్ పడి చాలా కాలమైయింది. సీటీమార్ అనే యావరేజ్ తప్పితే గత కొన్నేళ్ళుగా సక్సెస్ రాలేదు. మారుతితో చేసిన పక్కా కమర్షియల్ టైటిల్ కే పరిమితమైయింది. ఎన్నో ఆశలు పెట్టుకొని లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ కాంబినేషన్ తో వచ్చిన రామబాణం అయితే డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది. కనీస ఓపెనింగ్స్ రాలేదు. కథల ఎంపికలో గోపీచంద్ అంచనాలు, లెక్కలు తప్పుతున్నాయనే వాస్తవాన్ని మరోసారి ఎత్తిచూపింది రామబాణం.
అయితే ఇప్పుడు గోపిచంద్ లైన్ లో మరోసారి సినిమా వుంది. శివరాజ్ కుమార్ తో వేద చిత్రాన్ని తీసిన దర్శకుడు హర్ష తో ఓ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఇది పోలీస్ కథ అని తెలిసింది. పోలీస్ కథలు గోపిచంద్ కి బాగా నప్పుతాయి. ఈ మధ్య తన నుంచి సరైన పోలీస్ కథ రాలేదు. హర్ష కొంచెం యూనిక్ గా వుండే ఐడియానే చెప్పాడట. ఇప్పటికే కొంత షూటింగ్ చేశారు. రామబాణంతో కాస్త బ్రేక్ తీసుకున్న గోపి త్వరలోనే కొత్త షెడ్యుల్ లో జాయిన్ అవుతారు. మరి ఈ పోలీస్ కథ అయిన గోపికి ఓ సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.