ఎన్నికల సంఘం ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించింది. ఇందు కోసం సమీక్షలు చేస్తోంది. కావాల్సిన సమాచారం సేకరిస్తోంది. సోమవారం ఈ అంశంపై స్పష్టత రావడంతో అసలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరగాల్సిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడు ఎందుకు సన్నాహాలు అనే అనుమానం చాలా మందికి వచ్చింది.దీంతో ఎక్కువ మంది జగన్ .. తెలంగాణతో పాటు ముందస్తుకు వెళ్లడానికి సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది.
సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అసెంబ్లీ రద్దు ?
నవంబర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. అదీ కూడా మొదటి వారంలోనే వస్తుంది. అంటే.. ఎన్నికల సంఘం ఆ ఐదు రాష్ట్రాలతో కలిపి ముందస్తు ఎన్నికలు జరపాలంటే… కనీసం రెండు నెలల ముందు అయినా అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈసీ సన్నాహాల కోసం మరికొంత సమంయ తీసుకుంటుంది.కానీ సీఎం జగన్ తెర వెనుక ప్రయత్నాల ద్వారా చివరిక్షణంలో రద్దు చేస్తామని..మీ సన్నాహాలు మీరు చేయండని ఈసీని ఒప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
కేంద్రం సహకారంతోనే !
ముందస్తుకు వెళ్లాలంటే కేంద్రం సహకారం తప్పని సరి. కేంద్రం కాదంటే జరిగే చాన్స్ లేదు. ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసినా కేంద్రం కాదంటే మాత్రం.. రాష్ట్రపతి పాలన అయినా విధిస్తారు కానీ ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్రం సపోర్ట్ లభిస్తోందని చెబుతున్నారు. గత కొంత కాలంగా ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీకి ముందస్తుకు సహకరించాలన్న విజ్ఞప్తి చేశారని ఆయన మీ ఇష్టం అన్నారన్న ప్రచారం జరుగుతోంది.
చివరి క్షణంలో కేంద్రం, ఈసీ హ్యాండిస్తే రాష్ట్రపతి పాలనే !
అక్టోబర్లో అసెంబ్లీని రద్దు చేస్తే .. రోజుల్లోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదు. అయితే ఈసీ, కేంద్రం సపోర్ట్ ఉంటే సాధ్యం కావొచ్చు. ఒక వేళ జగన్మోహన్ రెడ్డిని వదిలేయాలని అనుకుంటే మాత్రం ఆయన అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత పట్టించుకోరు. ఎందుకంటే ఆ తర్వాత ఆరు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అంటే జగన్ ఆరు నెలల ముందే అధికారం కోల్పోతారు కానీ.. ఎన్నికలు జరగవు. అలాంటిది జరగుతుందని తెలిస్తే జగన్ చివరి క్షణంలో వెనుకడుగు వేస్తారని అనుకుంటున్నారు.