నలుగురు సలహాదారుల పదవులు పొడిగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నలుగురు సజ్జల రామకృష్ణారెడ్డి, కల్లాం అజేయరెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, శామ్యూల్. ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి డీ ఫ్యాక్టో సీఎం అని చెబుతూ ఉంటారు. ఆయన లేకపోతే ప్రభుత్వం నడవదు .. ఇంకా చెప్పాలంటే.. ఆయన సలహాదారు పదవి పొడింగుపు ఉత్తర్వులు ఇవ్వాలని ఆయనే ఆదేశించి ఉంటారు. ఇక జీవీడీ కృష్ణమోహన్.. జగన్ ప్రసంగాల రచయిత. నోరు తిరగని ప్రసంగాలను ఈ మధ్య రాస్తున్నట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ… వీలైనంత సరసంగా రాయాలని సలాహా ఇచ్చి జీవీడీ కృష్ణమోహన్ కు మరోసారి సలహాదారు పదవి కొనసాగించారు. నవరత్నాల పథకాల గురించి శామ్యూల్ సీఎంవో ఆఫీసులో పని చేస్తూంటారు అందుకని ఆయనకూ పొడిగింపు ఇచ్చారు.
మరి కల్లాం అజేయరెడ్డి కి ఎందుకు పొడిగింపు ఇచ్చినట్లు ? చాలా కాలంగా కల్లాం అజేయరెడ్డి సీఎంవో లో కానీ.. తాడేపల్లిలో కానీ కనిపించడం లేదు. ఆయన కు చాంబర్ కూడా తీసేసినట్లుగా చెబుతున్నారు. ఆయనకు పనేమీ లేదు..కాబట్టి గడ్డం పెంచుకుని ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. గతంలోనే .. ఓ సారి ఆయనను సలహాదారు పదవి నుంచి తొలగించినట్లుగా ప్రచారం జరిగింది. కానీ పీవీ రమేష్ ను సాగనంపి ఆయనను మాత్రం కొనసాగించారు. ఇక పొడిగింపు ఉండదేమో అనుకున్నారు. అనూహ్యంగా ఆయనకూ పొడిగింపు లభించింది.
ఇటీవల ఆయన పేరు.. వివేకా హత్య కేసులో సాక్షుల జాబితాలో చేరింది. జగన్ వివేకా హత్య గురించి మొదట చెప్పిన వాళ్లలో.. కల్లాం అజేయరెడ్డి కూడా ఉన్నారు. ఆయనను సీబీఐ ప్రశ్నించి స్టేట్ మెంట్ రికార్డు చేసింది. ఈ వ్యవహారం సంచలనం అయింది. ఇప్పుడు వివేకాను హత్య చేశారని బయట ప్రపంచానికి తెలియక ముందే జగన్ కు తెలుసని సీబీఐ చెబుతోంది. అంటే.. ఇప్పుడు కల్లాం అజేయరెడ్డి సాక్ష్యంకీలకం. ఎందుకైనా మంచిదని..సలాహాదారు పదవిని కొనసాగిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పాపం ప్రభుత్వ పెద్దలకు ఒక తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తప్ప చేయక తప్పలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.