రుద్రమదేవి తరవాత… గుణశేఖర్ మరో భారీ ప్రాజెక్ట్ రూపొందించే పనిలో పడిపోయాడు. ఈసారి గుణశేఖర్ దృష్టి పౌరాణికాలపై పడింది. ‘హిరణ్యకశ్యప’ అనే స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారు గుణ. ఈ సినిమాని అంతర్జాతీయ సాంకేతిక నైపుణ్యంతో తెరకెక్కించాలని ప్రణాళికలు వేస్తున్నారు. హిరణ్యకశ్యపగా ఓఅగ్ర కథానాయకుడు నటిస్తారని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారాయన. ఇప్పుడు ఆ హీరో దొరికేశాడు. హిరణ్యకశ్యపగా రానా కనిపించనున్నాడు. ఇటీవల రానాతో గుణశేఖర్ భేటీ అవ్వడం, స్క్రిప్టు మొత్తం వివరించడం జరిగిపోయాయి. ఈ సినిమా చేయడానికి రానా కూడా అంగీకారం తెలిపాడు. ‘రుద్రమదేవి’లో రానా ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ అనుబంధంతోనే గుణశేఖర్‌తో మళ్లీ జట్టు కట్టడానికి రానా ముందుకొచ్చాడని తెలుస్తోంది. ‘రుద్రమదేవి’ తరవాత ‘ప్రతాపరుద్రుడు’ కథని తెరకెక్కిస్తానని చెప్పాడు గుణ. ఎందుకనో.. అది పక్కకు వెళ్లి `హిరణ్య కశ్యప` తెరపైకొచ్చింది. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్లోరానా ఎంట్రీపై ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.