జీవీఎల్ నరసింహారావు … ఏపీలో వైసీపీ కోసం అప్పుడే డ్యూటీ ఎక్కేశారు. వైసీపీ ప్రచారం చేస్తున్నట్లుగా… అమరావతికి కేంద్రం ఇచ్చింది అప్పే అని ఊరూవాడా సర్టిఫికెట్లు జారీ చేయడానికి రెడీ అయిపోయారు. శాంపిల్‌గా ఆయన ఓ వర్గం మీడియాను పిలిచి మరీ ఈవిషయం చెప్పారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ.15 వేల కోట్లు అప్పేనని చెప్పుకొచ్చారు. ఆ అప్పును కేంద్రం చెల్లిస్తుందా? రాష్ట్రం చెల్లిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదుని.. ఈ అప్పు తీర్చేందుకు కనీసం 30 ఏళ్లు పడుతుందని చెప్పుకొచ్చారు. జీవీఎల్ మాటల్ని పట్టుకుని వైసీపీ మీడియా రంగంలోకి దిగిపోయింది.
అమరావతికి ఇంకా కేంద్రం అప్పో.. సొప్పో ఏదీ ఇంకా ఇవ్వలేదు. బడ్జెట్లో పెట్టింది. అది అప్పా.. గ్రాంటా అనేదానిపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పాల్సింది చెప్పారు. కేంద్రం గ్యారంటీగా ఉండి ఇప్పించే అప్పులు కేంద్రం ఖాతాలోనే ఉంటాయి. రాష్ట్రం ఓ పది శాతం కట్టాల్సి ఉంటుంది. ఆ పది శాతం కూడా రాష్ట్రం కట్టలేకపోతే.. చూస్తామని చెప్పారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. అభివృద్ధి పనులు జరిగితే ఆటోమేటిక్‌గా పెట్టుబడి అంతా తిరిగి వస్తుంది.
Also read : తయారీ రంగానికి కేంద్రంగా రాయలసీమ
అయినా ఇప్పుడు జీవీఎల్ కొత్తగా వైసీపీ చేస్తున్న వాదనను ఎందుకు బలంగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారో చాలా మందికి తెలుసు. ఆయనకు వైసీపీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పాల్సిన పని లేదు. అంతా బహిరంగ రహస్యమే. అందుకోసమే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగా … వ్యతిరేక భావన వచ్చేలా స్టేట్ మెంట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆయన కోవర్ట్ ఆపరేషన్ల గురించి బీజేపీలో అందరికీ స్పష్టత ఉంది. ఆయన బీజేపీలో ఉండి వేరే పార్టీ కోసం పని చేయాలనుకుంటే.. గతంలోలా ఉండదని టీడీపీ శ్రేణులు గట్టిగానే కౌంటర్లు ప్రారంభించాయి.