బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా పట్టించుకోని కేటీఆర్..ప్రచార తీవ్రత పెరుగుతుందనో, వ్యూహమో ఈ వార్తలను ఖండించేశారు. విలీనం కోసం కేటీఆర్ తోపాటు హరీష్ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారని పుకార్లు షికార్లు చేస్తున్నా హరీష్ రావు మాత్రం పెదవి విప్పలేదు.
బుధవారం ప్రెస్ మీట్ పెట్టిన హరీష్ ఇతర అంశాలపై మాట్లాడి, ఇంత సీరియస్ అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
అయితే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఖండించారు..హరీష్ ఖండించకపోతేనేం అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కానీ, ప్రతి విషయాన్ని ఇలాంటి వాటితో కప్పిపుచ్చలేం. పార్టీకి సంబంధించి ఇది సీరియస్ విషయం ..ఇలాంటి విషయాలపై సీనియర్ నేత హరీష్ కూడా స్పందిస్తే విషయం పై మరింత క్లారిటీ ఇచ్చినట్లు అవుతుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి.
అంటే తెర వెనక ఏదో జరుగుతుంది కాబట్టే కేటీఆర్ ఒక్కరే ఈ వార్తలను ఒక ట్వీట్ ద్వారా ఖండించారు అని కాంగ్రెస్ వైపు నుంచి కౌంటర్లు వస్తున్నాయి. ఇటీవల హరీష్ కూడా ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్ తరహాలోనే ఆయన కూడా ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఎందుకు ట్వీట్ చేయలేదు అన్న ప్రశ్నను కాంగ్రెస్ సంధిస్తూ బీఆర్ఎస్ ను ఇరుకునపెడుతోంది.