తెలంగాణలో తాము గొప్ప పాలన అందించామని చెప్పుకునేందుకు… పక్కన ఉన్న ఏపీని గొప్ప సాక్ష్యంగా చూపించడంలో హరీష్ రావు చాలా రాజకీయ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. గతంలో కరెంట్ మీటర్ల విషయంలో జగన్ ను టార్గెట్ చేసినా… అప్పుల విషయంలో అడుక్కుంటున్నారని అన్నా.. ఇటీవల ఆయన పూర్తిగా జగన్ ను .. వైసీపీని మాత్రమే టార్గెట్ చేసేవారు. అయితే ఇప్పుడు రూటు మార్చారు. జగన్ ను కాకుండా చంద్రబాబును కూడా అనడం ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లాలో దశాబ్ది ఉత్సవాల్లో మాట్లాడిన ఆయన ఏపీ ప్రస్తావన తీసుకు వచ్చారు. ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్కబోర్లా పడిందని.. వాళ్ళది ప్రచారం ఎక్కువ.. మనది పని ఎక్కువ అని అన్నారు. గతంలో ఓ పాలకుడు ఉండేవాడని. ఆయన హైలెట్ .. అడ్మినిస్ట్రేషన్ అనేవాడని .. ఇద్దరూ కలిసి ఏపీని ఈ దుస్థితికి తెచ్చారన్నారు. పేర్లు చెప్పకపోయిన వారిద్దరూ చంద్రబాబు , జగన ్అని సులువుగానే చెప్పవచ్చు. సంగారెడ్డిలో ఆంధ్ర నుంచి వలస వచ్చిన కార్మికులు ఎక్కువగా ఉంటారు.. గతంలో ఇలాగే జగన్ సర్కార్ న విమర్శించి… అందరూ ఓట్లు తెలంగాణకు మార్పించుకోవాలనిసలహాఇచ్చారు.
చంద్రబాబు ఉన్న సమయంలో అత్యధిక పరిశ్రమలు, పెట్టుబడులు ఏపీకే వచ్చేవి. హీరో ప్లాంట్, కియా ప్లాంట్ వంటి వాటి కోసం తెలంగాణ ఎంత పోటీ పడినా ప్రయోజనం లేకపోయింది. విభజన తర్వాత ఏపీని పారిశ్రామికంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు.. తెలంగాణకు ఇబ్బందికరంగా మారాయి. అందుకే వైసీపీకి మద్దతిచ్చారు. వైసీపీ గెలిచిన తర్వాతఏపీకి వచ్చిన ప్లాంట్లు అన్నీ తెలంగాణకు వెళ్లిపోయాయి. చివరికి అమరరాజా కూడా తెలంగాణకు వెళ్లిపోయింది. ఇప్పుడు తెలంగాణ నేతలు ఏపీని ఎగతాళి చేస్తున్నారు.