మహేష్ బాబుతో సినిమాలు చేయాలని అందరి డైరెక్టర్లకి వుంటుంది. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్లు మహేష్ ని ద్రుష్టిలో పెట్టుకొని కథలు రెడీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షిస్తుంటారు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా మహేష్ తో సినిమా చేయాలని అనుకున్నారు. గబ్బర్ సింగ్ హిట్ తో హరీష్ కి ఇండస్ట్రీలో అన్నీ తలుపులు తెర్చుకున్నారు. ఆయన కథకు వినడానికి అందరూ ఆసక్తి చూపారు. ఈ సమయంలోనే మహేష్ తో సినిమా అనుకున్నారు హరీష్.
అయితే రామయ్య వస్తావయ్యా ఫలితం హరీష్ ని వెనక్కి లాగింది. ఆయన ప్లాన్స్ అన్నీ అటు ఇటు అయిపోయాయి. అయితే ఎప్పటికైనా మహేష్ తో సినిమా చేయాలని వుందని చెబుతున్నారు హరీష్. తాజాగా జరిగిన బచ్చన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ టాపిక్ వచ్చింది. ‘మహేష్ బాబు గారితో పోకిరి లాంటి సినిమా తీయాలని వుంది’అని తన మనసులో మాట బయటపెట్టారు హరీష్.
Read Also :మిస్టర్ బచ్చన్: పాటలు, గ్లామరే నమ్ముకొన్నాడా?
హరీష్ మంచి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టరే. మహేష్ బాబు టైమింగ్ ని పట్టుకునే సత్తా ఆయనలో వుంది. కాకపోతే ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి సినిమాతో వున్నారు. దాదాపు మూడేళ్ళు ఈ సినిమాకే పట్టేస్తింది. రాజమౌళి సినిమా తర్వాత హీరోల లీగ్ మొత్తం పాన్ ఇండియా చుట్టూ తిరుగుతుంది. అప్పటికి ఎలా వుంటుందో చెప్పలేం. ప్రస్తుతానికైతే ఈ కాంబినేషన్ కుదిరే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదు.