రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రూపొందిస్తోంది. దీనికి ‘మిస్టర్ బచ్చన్’ అనే పేరు ఖరారు చేశారు. బాలీవుడ్ లో ఘన విజయాన్ని అందుకొన్న ‘రైడ్’ చిత్రానికి అఫీషియల్ రీమేక్ ఇది. నిజానికి ఈ రీమేక్ రైట్స్ ఏషియన్ ఫిల్మ్స్ నారంగ్ దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర రూ.2 కోట్లకు ‘రైడ్’ రైట్స్‌కి దక్కించుకొన్నారు. అంతే కాదు.. సినిమా ప్రాఫిట్ లో 20 శాతం వాటా… ఇవ్వాల్సి వస్తోంది.
నిజంగా చాలా బెటర్ డీల్ ఇది. రవితేజ – హరీష్ అంటే కాంబినేషన్ పరంగా క్రేజ్ ఉంటుంది. రీమేక్ సినిమాల్ని తనదైన శైలిలో తీసే దర్శకుడు హరీష్. కాబట్టి మినిమం గ్యారెంటీ ఉంటుంది. పక్కా ప్లానింగ్ తో సినిమా తీస్తే కనీసం 20 కోట్లయినా టేబుల్ ప్రాఫిట్ ఉంటుంది. అంటే అందులోంచి మరో రూ.4 కోట్లు.. రీమేక్ రైట్స్ రూపంలో వెనక్కి ఇవ్వాలన్నమాట. అంటే.. కథ కోసం రూ.6 కోట్లు ఖర్చు పెట్టాల్సివస్తోంది. రూ.6 కోట్లు రీమేక్ రైట్స్ రూపంలో ఇవ్వగలిగేంత సరుకు ‘రైడ్’లో ఉందా? అంటే చెప్పలేం. కొన్ని కథలపై దర్శకులకు, హీరోలకు, నిర్మాతలకూ అలా గురి కుదిరిపోతుందంతే. కథ నచ్చితే, రెడీమెడ్గా దొరుకుతుంటే ఎంత ఇవ్వడానికైనా రెడీ అంటారు. ‘రైడ్’ విషయంలో అదే జరిగింది.