నిన్నామొన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో ఉండి… చీరాల మొత్తం.. తన కనుసన్నల్లో ఉండే అధికారులను నియమింప చేసుకున్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఇప్పుడు… ఉక్కపోత ప్రారంభమయింది. ఆమంచి విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ.. ఆయన ప్లస్ పాయింట్లన్నింటినీ… మైనస్‌గా చేస్తూ పోతోంది. ఆమంచి ఏరికోరి నియమించుకున్న పోలీసులు, ఇతర అధికారుల్ని.. చీరాల నుంచి బదిలీ చేసేశారు. చివరికి ఆయన గన్మెన్లను కూడా… బదిలీ చేశారు. ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరిన వెంటనే చీరాలలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. నియోజకవర్గంలో డీఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ స్థాయి అధికారి వరకు బదిలీలు జరిగాయి.
పనిలో పనిగా జిల్లా ఎస్పీని కూడా మార్చారు. ఓ కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తరువాత ఆమంచి గన్మెన్లను కూడా మార్చారు. దీంతో.. ఆమంచి కృష్ణమోహన్‌కు ఏదో కొడుతోందన్న విషయం అర్థమయింది. వెంటనే.. ఎస్పీ వద్దకు వెళ్లారు. టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలున్నాయని ఫిర్యాదు చేశారు. కొత్తగా తనకు కేటాయించే గన్మెన్లను ప్రభుత్వం ఇంటిలిజెన్స్ ఏజెంట్లుగా వాడుకుంటుంటుందని… అందువల్ల తనకు రాజకీయంగా నష్టం జరుతుందని వాపోయారు. తాను కోరుకున్న వారినే.. గన్మెన్లుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. రూల్స్ ప్రకారం.. గన్మెన్లను కేటాయిస్తామని.. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ చెప్పి పంపించారు. ఆయితే.. ఆమంచి ఎస్పీని కలిసిన కాసేపటికే… చీరాల వైసీపీ ఇన్చార్జ్.. యడం బాలాజీ… ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీతో సమావేశం అయ్యారు. ఆయన ఆమంచి కృష్ణమోహన్ అనుచరులపై ఫిర్యాదు చేశారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో ఉన్నప్పుడు.. అనుకూల పోలీసులను పెట్టుకుని… కృష్ణమోహన్ తనపైన..తన అనుచరులపై.. ఎలా వేధింపులకు పాల్పడ్డారో.. వివరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆమంచి కృష్ణమోహన్‌కు .. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి మారి.. ఆ పార్టీపై విమర్శలు ప్రారంభిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో.. ఆ ఉక్కపోత మాత్రం… అర్థమవుతోందని చీరాలలో.. ఆయన వ్యతిరేకులు…సంతోషపడుతున్నారు. ఇంత కాలం.. అధికార పార్టీ ఎమ్మెల్యే ట్యాగ్‌తో.. అనుకూలమైన పోలీసుల్ని నియమించుకుని ఆయన చేసిన వ్యవహారాలు.. ఇప్పుడు రివర్స్‌లో ఆయనకే ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.