తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
హైదరాబాద్ నగరమంతా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా రాబోయే కొద్ది గంటల్లో నగరవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అయితే, నగరంలో వర్షం పడుతుండటంతో నేడు ఉప్పల్ వేదికగా జరగాల్సిన సన్ రైజర్స్ హైదరాబాద్ – గుజరాత్ ల మధ్య మ్యాచ్ పై అనుమానాలు నెలకొన్నాయి. వరణుడు ఈ మ్యాచ్ ను అడ్డుకుంటాడా..? అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ మ్యాచ్ కు వరణుడు ఆటంకం కల్గించినా మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం లేదని సమాచారం.