తెలుగులో ఘన విజయం సాధించిన చిత్రం 100 % లవ్. హీరో నాగచైతన్యనే అయినా…. చైతూ కంటే తమన్నాకే ఎక్కువ పేరు తీసుకొచ్చిందీ సినిమా. దీంతోనే తమన్నా స్టార్ కథానాయికల జాబితాలో చేరిపోయింది. ఇంతకాలానికి ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో జీవి ప్రకాష్ హీరోగా నటిస్తున్నాడు. కథానాయికగా లావణ్య త్రిపాఠీని ఎంచుకొన్నారు. ఈ సినిమా పట్టాలెక్కడమే ఆలస్యం అనుకొంటున్న తరుణంలో.. లావణ్యకు షాక్ ఇచ్చింది చిత్రబృందం. లావణ్య ప్లేస్‌లో హెబ్బా పటేల్‌ని తీసుకోవడానికి ఫిక్సయిపోయార్ట. కథానాయిక మారడానికి కారణం.. సుకుమారే అన్నది ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. కుమారి 21 ఎఫ్‌తో హెబ్బా పటేల్ జాతకం తిరగబడింది. ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన సుకుమార్‌కి లావణ్య టాలెంట్‌పై గురి కుదిరింది. ”రీమేక్‌లో లావణ్య కంటే.. హెబ్బానే బెటర్… తమన్నా పాత్రకు తనే న్యాయం చేస్తుంది..” అని సుకుమార్ సూచించడంతో…. తమిళ చిత్రబృందం లావణ్యని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి సుక్కు వల్ల… లావణ్య చేతిలోంచి బంగారంలాంటి అవకాశం చేజారిపోయింది. అయినా లావణ్య త్రిపాఠికి ఈమధ్య కాలం కలసి రావడం లేదు. మిస్టర్ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో పాటు రాధ కూడా డిజాస్టర్ లిస్టులో చేరింది. ఇప్పుడు ఈ సినిమా ఛాన్స్ మిస్సయిపోయింది. ఏం చేస్తాం?? టైమ్ బ్యాడ్… అంతే.