ఈ వారం ఓ చిన్న సినిమా విడుదల అవుతోంది. ఆ సినిమా పేరు.. ‘రెండు రెళ్లు ఆరు’. మామూలుగా అయితే… ఈసినిమాపై అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ… ఇప్పుడు ఈ సినిమా ఇండ్రస్ట్రీ వర్గాల్ని ఆకర్షిస్తోంది. దానికి ఓ కారణం… ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి హ్యాండవర్ చేసుకోవడం. రెండోది కథ.
అఖిల్ – విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ, ‘రెండు రెళ్లు ఆరు’ కథ ఒకటే అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఓ ఆసుపత్రిలో ఒకేసారి రెండు కాన్పులు జరుగుతాయి. ఓచోట బాబు పుడితే, మరో చోట అమ్మాయి పుడుతుంది. ఆ ఇద్దరూ.. తారుమారు అవుతారు. వాళ్లే పెద్దయ్యాక ప్రేమలో పడతారు. కొడుకు తన ఇంటికే అల్లుడిగా వస్తాడు. కూతురు… తన ఇంటికి కోడలుగా వెళ్తుంది. అదీ.. కథ. స్టోరీలైన్ కొత్తగా తమాషాగా ఉంది. మనంలో నాన్న కొడుకుగా మారినట్టు… కథలో లింకులు బాగా వేసుకొన్నాడు విక్రమ్ కె.కుమార్. అయితే… ‘రెండు రెళ్లు ఆరు’ కథ కూడా ఇదేనని సమాచారం. ట్రైలర్ చూస్తే.. అది నిజమే అనిపిస్తోంది. దాంతో అఖిల్ సినిమా ముందే వచ్చేస్తుందని ప్రచారం సాగుతోంది. అయితే.. అఖిల్ సినిమా కథ ఇది కాదని, నాగార్జున మార్చేశాడని తెలుస్తోంది. ఈ స్టోరీలైన్ బాగున్నా – సెకండాఫ్ నాగార్జునకు నచ్చలేదు. దాంతో కథ మార్చి.. కొత్తగా రాసుకొన్నాడు విక్రమ్ కె.కుమార్. సరిగ్గా అదే పాయింట్‌తో ఇప్పుడు రెండు రెళ్లు ఆరు తెరకెక్కింది. అందుకే.. నాగ్ రిజెక్ట్ చేసిన పాయింట్ తెరపై ఎలా వచ్చిందా? అంటూ ఆసక్తి మొదలైంది. రెండు రెళ్లు ఆరు గనుక ఏ పెళ్లి చూపులు సినిమాలానో ఆడేస్తే… నాగార్జున ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మరి.