ఒకప్పుడు యూత్ హీరోగా మెరిసి, ఇప్పుడు క్యారెక్టర్ పాత్రల్లో సర్దుకుపోతున్నాడు నవదీప్. ఇప్పుడు ఓ కొత్త వ్యాపారంలోకి దిగుతున్నాడు. హైదరాబాద్‌లో నవదీప్ ఓ బహుళ అంతస్థుల భవనాన్ని లీజుకు తీసుకున్నాడు. ఇందులో ఓ స్టూడియోలాంటిది ఏర్పాటు చేస్తున్నాడు. కథా చర్చలు, ఎడిటింగ్, రీ రికార్డింగ్… వీటికి అనుగుణంగా ఓ అపార్ట్‌మెంట్‌ని తీర్చిదిద్దుతున్నాడు. ఇందులో కాఫీ షాపులు, రెస్టారెంట్లు కూడా ఉంటాయి. ఈరోజుల్లో షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్‌లు చేయడానికి యువతీయువకులు ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్లకు తక్కువ ఖర్చులో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా అందించబోతున్నాడు. నవదీప్‌కి సినీ పరిశ్రమలో పరిచయాలు ఎక్కువ. వాటిని ఉపయోగించుకుంటే… ఈ రంగంలో సక్సెస్ అవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. స్టోరీ సిట్టింగుల కోసం సినిమావాళ్లు గోవా, బ్యాంకాక్‌లు వెళ్తుంటారు. లేదంటే స్థానికంగానే హోటెళ్లలో భేటీ వేస్తుంటారు. కాఫీ షాపుల్లో మీటింగులు పెడుతుంటారు. ఈ అవసరాలన్నీ నవదీప్ తీరుస్తాడన్నమాట.