జగన్ రెడ్డి హయాంలో జంటగా ఆరోపణల కచేరీలు పెట్టిన సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాడీ అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలకు ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేయడానికి అవసరమైన పరిస్థితులు కలసి వచ్చాయి. వీరిద్దరూ నిబంధనలు ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం సమాధానం ఇస్తే.. చర్యలు ఏం తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నిస్తుంది.
అప్పటి వరకూ రాకుండా ప్రభుత్వం ఈ ఇద్దరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేసే అవకాశం ఉంది. పెట్టిందే తప్పుడు కేసులు. అయినా అవసరం లేకపోయినా హైదరాబాద్, ఢిల్లిల్లో ఇద్దరూ ప్రెస్ మీట్లు పెట్టారు.దానికి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. కోర్టులో ఉన్న కేసుల మీద ఇలా ప్రెస్మీట్లు పెట్టడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధం. ఐపీఎస్ అధికారి అయిన సంజయ్ పై ఈ కారణంతో కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఆయనపై కేసులు పెట్టి అరెస్టు కూడా చేయవచ్చు. సర్వీసులో ఉండగా ఆయన చేసిన పాపాలకు అవి తక్కువేనని ఆయన నిర్వాకాల గురించి తెలిసిన ఎవరైనా తేల్చేస్తారు.
Also Read : పొన్నవోలు ఫ్యాక్షనిస్టే కాదు మైనింగ్ డాన్ కూడా !
ఇక వన్ వే టిక్కెట్ గా ప్రసిద్ది పొందిన పొన్నవోలు ఇప్పుడు ఏఏజీ పదవిలో లేరు. కానీ ఆయన పదవిలో ఉన్నప్పుడు తప్పు చేశారు. అప్పుడు చేసినందుకు ఇప్పుడు ఎలాంటి శిక్షకు గురవుతారో.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో న్యాయనిపుణులు పరిశీలన చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్కువగా ఇరుక్కుపోయేది మాత్రం సీఐడీ చీఫ్ గా చేసిన సంజయ్యే. ఎందుకంటే ఆయన సర్వీసులోనే ఉన్నారు మరి.