కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని హిమాన్షు ఖండించినట్లుగా సోషల్ మీడియాలోపోస్టింగ్లు కనిపిస్తున్నాయి. తనకు ఎలా దెబ్బలు తగిలాయో చెప్పలేదు కానీ.. జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమేనని తాను నడవగలిగే పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఆయన సోషల్ మీడియా పోస్టింగ్ కనిపించింది.
మామూలుగా అయితే ఈ విషయాన్ని అందరూ లైట్ తీసుకునేవారు. కానీ కేసీఆర్ ఫ్యామిలీలో హిమాన్షు ప్రత్యేకం. సీఎం కేసీఆర్ కు హిమాన్షు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పనులైనా హిమాన్షును పక్కన పెట్టుకునే చేస్తారు. శంకుస్థాపనలు కూడా హిమాన్షుతో చేయించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే..హిమాన్షుకు గాయాలనే సరికి సోషల్ మీడియా కూడా సూపర్ యాక్టివ్గా మారిపోయింది. అదీ కూడా హార్స్ రైడింగ్ చేస్తూ ప్రమాదం అనే సరికి రకరకాల కోణాల్లో విశ్లేషించడం ప్రారంభించారు.
ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. ప్రస్తుతానికి హిమాన్షుకు యశోదా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా చెబుతున్నారు. రాజకీయ ఫ్యామిలీలో భవిష్యత్ ఉన్న చిన్నారిగా ఉన్న హిమాన్షు.. తను కింద పడిన విషయాన్ని అచ్చంగా రాజకీయ నేతలాగే కవర్ చేసుకున్నారని.. టీఆర్ఎస్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.