భారత్ నుంచి మరో సంచలనం అంటూ హిండెన్ బెర్గ్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఆ బంబును ఏకంగా సెబీ చైర్మన్ మీదనే వేశారు. గతంలో విడుదల చేసిన నివేదికలో అదాని కంపెనీలపై హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. తాజా నివేదికలో అదాని ఆఫ్‌షోర్ సంస్థల్లో సెబి ఛైర్పర్సన్ మాధబి పురి బచ్‌కు, ఆమె భర్త ధావల్ బచ్‌కు వాటాలు ఉన్నాయని బయటపెట్టింది.
అదాని సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచడానికి వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి పురి బచ్. ఆమె భర్త పెట్టుబడులు పెట్టారని పత్రాలు బయటపెట్టింది. ఈ మేరకు విజిల్ బ్లోయర్ నుండి సమాచారం అందినట్లు పేర్కొంది. గౌతమ్ అదాని సోదరుడు వినోద్ అదాని నిర్వహిస్తున్న మారిషస్, బెర్ముడాలోని రెండు షెల్ కంపెనీలో కూడా వీరు పెట్టుబడులు పెట్టారని తెలిపింది. అదాని కుంభకోణం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా పెట్టుబడులపై వారు పెదవి విప్పలేదని ఆదాని గ్రూపు షేర్ల విలువను కృత్రిమంగానైనా పెంచడానికి సెబి ఆసక్తి చూపారని హిండెన్ బర్గ్ చెబుతోంది.
అదానీలపై హిండెన్ బెర్గ్ ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేసింది. కానీ ఏమీ తేల్చలేదు. అందుకే సుప్రీంకోర్టు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా సెలబీ చైర్మన్ పైనే ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల ప్రభావం షేర్‌మార్కెట్‌పై తీవ్రంగానే ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో తమపై తప్పుడు ప్రచారం చేశారని లీగర్ యాక్షన్స్ తీసుకుంటామన్న అదానీ గ్రూప్ ఇప్పటి వరకూ ఆ పని చేయలేకపోయింది.