రింకు దుగ్గా అనే ఐపీఎస్ ఆఫీసర్ని కేంద్రం బలవంతంగా రాజీనామా చేయించింది. ఆమెను సర్వీస్ నుంచి తొలగించింది. ఆమె చేసిన తప్పేమిటంటే.. ఢిల్లీలో తన ఇంటి దగ్గర ఉన్న ఓ స్టేడియాన్ని రాత్రి పూట ఇతర క్రీడాకారులెవరూ వాడుకోకుండా ఖాళీ చేయించి.. తన పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేది. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారించి ఆమెను సర్వీస్ నుంచి తప్పించేందుకు రాజీనామా చేయించారు. ఇది వ్యక్తిగతంగా చేసిన తప్పిదం. మరి సర్వీసులో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే ఎలా వదిలి పెడతారు ? అందునా కళ్ల ముందు కనిపస్తున్న తప్పులు ఉంటే ? కానీ పట్టించుకోరు.
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పూర్తి స్థాయిలో సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మరీ సంజయ్ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆల్ ఇండియన్ సర్వీస్ రూల్స్ మేరకు రాజకీయ పక్షపాతాలు లేకుండా పనిచేయాల్సిన సీఐడీ చీఫ్ అన్నింటినీ ఉల్లంఘించారని హోం మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్త మాదిరిగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సంజయ్, సీఎం వైఎస్ జగన్ కోసం ప్రతిపక్షాలపై బురద చల్లుతున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ సీఐడీ చీఫ్ సంజయ్ వ్యవహరిస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారు అని ఆరోపించారు.ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం రాజకీయ పక్షపాతం లేకుండా పనిచేయాల్సిందిపోయి అన్నింటిని ఉల్లంఘిస్తున్నారని స్పష్టం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రతిపక్షనేత చంద్రబాబుని అరెస్టు చేసి విచారణ చేయాల్సిన అధికారి, ఎటువంటి విచారణ జరపకుండానే సర్వీసు నిబంధనలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోపణలు చేయడం తీవ్రమైన నేరంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దర్యాప్తులో గోప్యంగా ఉంచాల్సిన అంశాలను మీడియాకి విడుదల చేస్తున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సీఐడీ చీఫ్ సంజయ్ ఉల్లంఘించిన సర్వీస్ రూల్స్, అతిక్రమించిన నిబంధనలు ఆధారాలను హోం మంత్రికి ఎంపీ రామ్మోహన్ నాయుడు పంపించారు. సీఐడీ చీఫ్ సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే సీఐడీ సంజయ్ ఇలా సర్వీస్ రూల్స్ ఇప్పుడే కాదు.. మార్గదర్శి విషయంలోనూ ఉల్లంఘించారు. ఓ వ్యాపార సంస్థపై ఐపీఎస్ అధికారి అన్ని విషయాలు బహిరంగంగనే ఉన్నాయి. కానీ రింకూ దుగ్గా వ్యక్తిగత అవసరాల కోసం అధికార దుర్వినియోగం చేస్తే రాజీనామా చేయించారు.. మరి సీఐడీ సంజయ్ కు ఎలాంటి శిక్ష వేయాలి ?. ఎందుకీ వివక్ష