రాజమండ్రిలోని రాకీ అవెన్యూస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. కేవలం 18 లక్షలకే సెకండ్ ఫేజ్ లో ఫ్లాట్. త్వరపడండి ఉగాది సందర్భంగా కంపెనీయే రిజిస్ట్రేషన్ ఫీజు భరిస్తుంది. పైగా జీఎస్టీ కూడా కట్టనవసరం లేదు అని ఆ కంపెనీ ప్రచారం చేసింది. అయితే ఆ ప్రచారం చేసింది మాత్రం యాంకర్ సుమ. మధ్యతరగతి కుటుంబాలని టార్గెట్ చేస్తూ అందరి దగ్గర కలిపి 88 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు బోర్డు తిప్పేసింది. అపార్టుమెంట్లు నిర్మాణం చేసి ఫ్లాట్ లు ఇస్తామని నమ్మించి మోసం చేసింది. దీంతో ఆ సంస్దకి డబ్బులు కట్టిన వాళ్ళందరూ రోడ్ ఎక్కారు. యాంకర్ సుమ చెప్పడం వల్లే కొన్నామని ఇప్పుడు తమ డబ్బులు సుమ కట్టాలని డిమాండ్ చేస్తున్నరు.
అయితే సుమ మాత్రం రాకీ అవెన్యూస్ అనే సంస్థతో తాను 2016 నుంచి 2018 వరకు మాత్రమే ఒప్పందం చేసుకున్నానని.. ఆ సమయంలోనే వారికి సంబంధించిన ప్రమోషనల్ యాడ్ చేశానని తెలిపింది. అయితే, ఇప్పుడు ఆ సంస్థతో తనకు ఎలాంటి లావాదేవీలు, సంబంధం కానీ లేదని.. స్పష్టం చేసింది. నిజానికి ప్రచారం చేసినంత మాత్రాన సుమకు బాధ్యత ఉండదు. కొనుగోలుదారులే అన్ని చూసి పరిశీలించి వస్తువు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాత గగ్గోలు పెట్టి ప్రయోజనం ఉండదు. గతంలో ధోనీ కూడా ఇలాంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ప్రచారం చేసి వివాదంలో ఇరుక్కున్నారు. కానీ ఆయనతో డబ్బులు కట్టించాలని అనుకోలేరు.
ఎవరు ప్రచారం చేసినా.. ప్రచార కర్తలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సొమ్ము చేసుకుంటారు. మరి నష్టపోయేది ఎవరు. కస్టమర్లు. వినియోగదారులు.. ఇళ్లు కొనుగోలు చేసి ఓ సొంత ఇంటిని సమకూర్చుకోవాలని ఆశపడే మధ్యరతగతి ప్రజలు. ఎంతో మంది మోసపోతున్నా ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూనే ఉంటోంది. అందుకే.. తక్కువ ధరలకు ఇళ్లు, ఫ్లాట్లు వస్తాయని సెలబ్రిటీలు ప్రచారం చేస్తే నమ్మేయవద్దు. అన్ని చూసుకున్న .. తర్వాత మాత్రమే.. ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయాలి. లేకపోతే జీవితాంతం కట్టుకోవాల్సిన అప్పులే మిగులుతాయి.