హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా కేసులో పోలీసులు మీడియా సంయమనం పాటించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఈ కేసుల్లో విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా అయిన స్కూళ్ల జాబితా ప్రకటించివుండాల్సింది కాదని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి దీనిపై ఒక ప్రతినిధి వర్గం ఆయనను కలిసింది. నిజం చెప్పాలంటే ఇటీవల ప్రతివిషయంలో హైదరాబాద్ పోలీసులు నాటకీయ ప్రచారంచేస్తున్నారు.శిరీష, ఎస్ఐ ప్రభాకరరెడ్డి ఆత్మహత్యల కేసుల్లోనూ మొత్తం తామే తేల్చి చెప్పేశారు. ఆ సిడిలు ఆడియో విడియో రికార్డింగులు టీవీలకు అందాయి. అంతకు ముందు నయీం ఎన్కౌంటర్ సమయంలోనూ ఇదే తంతు జరిగింది. ఈ మొత్తంలో తమ వైఫల్యాల గురించి గాని తమపై వచ్చిన ఆరోపణల గురించి గాని పోలీసులు నోరు మెదపరు. తేలిగ్గా ఖండిచేస్తారు. దానికి బదులుగా బాధితులపైన మృతుల పైన రకరకాల కథలుప్రచారంలో పెడతారు. డ్రగ్స్ ఇంతగా విస్తరించాయంటే పోలీసులు అరికట్టలేకపోవడం వల్లనే. వారు నేరస్త ముఠాలతో చేతులు కలిపి చూసీచూనట్టు వదిలేయకపోతే ఇంతగా విస్తరించే అవకాశమే వుండదు. కాని ఆ వివరాలు అక్షరం కూడా చెప్పరు. మత్తు పదార్తాలు తీసుకున్న వారి పేర్లు చిరునామాలు కథలు మాత్రం సీరియల్‌గా విడుదల చేస్తుంటారు. రసవత్తరంగా వుంటాయి గనక మీడియా కూడా భారీ ప్రచారమిస్తుంది. ఈ క్రమంలో స్కూళ్లపేర్లు విద్యార్థుల వివరాలు వస్తే వారికి ఎంత నష్టం? ఇప్పుడు అమ్మాయిలపైన కథలుచెబుతున్నారు. అవన్నీ నిజమైతే అరికట్టాలి తలిదండ్రులను అప్రమత్తం చేయాలి అంతేగాని వ్యసనాలకు బానిసలైన వారిని హీనంగా చూపవలసిన అవసరం లేదు. సమాజం అక్రమవ్యాపారులు అవినీతి అధికారుల అండదండలే లేకపోతే ఇవన్నీ జరగవు కదాు!