హైదరాబాద్ మునిగిపోయినప్పుడు తామే కారణం అని ఎప్పుడూ ప్రకటించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం.. హైదరాబాద్ మునిగిపోలేదని దానికి కారణం మేమేనని క్రెడిట్ తీసుకోవడానికి కేటీఆర్ వచ్చేశారు. అమెరికా టూర్ లో ఉన్న ఆయన అక్కడ్నుంచి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా స్ట్రాటజిక్ సాలా డెలవప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నాలాలు బాగు చేశామని అందుకే హైదరాబాద్ మునగలేదని ట్వీట్ చేశారు.
నిజానికి హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు పడలేదు. మామూలు వర్షాలే పడ్డాయి. గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా పడ్డాయి. ఖమ్మంలోనూ పడ్డాయి. ఖమ్మం పూర్తిగా మునిగిపోయింది. మరి కేటీఆర్ దానికేం చెబుతారు ?. ఓ గంట పాటు దడి వాన పడితేనే హైదరాబాద్ పరిస్థితి దుర్భరంగా మారుతుంది న్యూయార్క్ అని చెప్పుకునే ఐటీ కారిడార్‌లో నీళ్లు బయటకు పోవు. ఆ విషయాలన్నీ తెలిసి కూడా కేటీఆర్ తమ ఘనతే అని ప్రకటించుకోవడానికి ముందుకు వచ్చేశారు.
హైదరాబాద్‌లో ఓ మాదిరి వర్షం పడినా చాలా చోట్ల పరిస్ధితి దుర్భరంగా మారుతోంది. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పడినంత వాన పడితే హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఒక వేళ రేపోమాపో భారీ వర్షం పడి.. గందరగోళం ఏర్పడితే.. దానికి కారణం తామే అంటారో.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతకాని తనం అంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ట్రోలింగ్ ఎదుర్గోవాల్సి ఉంటుంది. అయినా కేటీఆర్ ఆరాటం.. కేటీఆర్‌ది.