తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాదు గురించి ఎన్నెన్నో వివాదాలు తర్జనభర్జనలు.. భౌగోళికంగా చారిత్రికంగా అది తెలంగాణలో భాగం కావడం ఖాయమని తెలిసినా రాజకీయ వర్గాలు అనేక కథనాలు వ్యాప్తిలో పెట్టేవి. పెద్ద పెద్ద నాయకులు పేర్లతోనే ఈ కథలు చలామణి అయ్యాయి. అందుకు తగినట్టే టిఆర్ఎస్ హైదరాబాదులో నామకార్థంగానే అసెంబ్లీ సీట్లు తెచ్చుకోగలిగింది. సరే అదంతా గతం. ఫిరాయింపులు ఓటుకు నోటు కేసు తర్వాత ఈ పరిస్థితి మారింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో మొత్తం తుడిచిపెట్టాక పూర్తిగా టిఆర్ఎస్ ఆధిపత్యమే ఏర్పడింది. కాని రాజధాని సమస్యలపై గాని అభివృద్ధిపై గాని ప్రభుత్వం తగినంతగా దృష్టి పెట్టడం లేదని టిఆర్ఎస్ నేతలే వాపోతున్నారు. ఏ సమస్య చెప్పినా చూద్దాం తర్వాత కలుద్దాం అంటూ సంబంధిత మంత్రి కెటిఆర్ దాటేస్తున్నారని ఇద్దరు నాయకులు సూటిగానే చెబుతున్నారు. ఆదాయం రీత్యానూ రాజకీయంగానూ కీలకమైన హైదరాబాదుపై ఈ నిర్లిప్తత ఎందుకంటే వారు ఇతర లావాదేవీల్లో మునిగిపోవడమేనంటున్నారు.ఇటీవల పూడిక తీత పేరిట జిహెచ్ఎంసి ఇంజనీర్లు చేసిన నిర్వాకాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు ఎప్పుడూ మీడియాలో ముఖాముఖి జరిపినా సమస్యలు విపరీతంగా వినిపిస్తున్నాయి. వైట్ ట్యాపింగ్ రోడ్ల వంటి వాగ్డానాలు తప్ప మరమ్మతులపై ఇచ్చిన భారీ వాగ్దానాలు ఇంకా అమలుకు నోచుకోవడం లేదని టిఆర్ఎస్ వారే అంటున్నారు. ఇక మేయర్‌కు స్వీయాధికారాలు చాలా తక్కువై పోయాయన్న రాజకీయాభిప్రాయం కూడా వుంది.మరి మెట్రో రైలును ఎస్ఆర్ నగర్ వరకే నడుపుతామని ప్రకటన రావడంతో పాత బస్తీకి ఇప్పట్లో లేదన్న సందేహాలు పెరుగుతున్నాయి.