హైదరాబాద్ – విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ – బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ – బెంగళూరు నగరాల మధ్య 44వ నెంబరు జాతీయ రహదారి ఉండగా.. దీనికి అదనంగా హైస్పీడ్ జాతీయ రహదారిని నిర్మించనున్నారు. వందేళ్ల స్వాతంత్ర భారతంలో సాధించిన లక్ష్యాల కోసం ఏర్పాటు చేసుకున్న ‘మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్-2047’లో భాగంగా ఈ రహదారిని నిర్మించనున్నారు.
ప్రయాణ సమయాన్ని తగ్గించేలా హైవేను అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్రం ప్లాన్ . ఇప్పటికీ డీపీఆర్ తయారీకి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ టెండర్లను ఆహ్వానించింది. ధీనికి సెప్టెంబరు 12 తుది గడువుగా నిర్ణయించింది. 12 వరుసలుగా ఈ నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికి.,. ఇప్పటికి ఆరు వరుసలకే పరిమితం కావాలని భావిస్తున్నారు. డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు. హైదరాబాద్ – బెంగళూరు మధ్య కొత్త రహదారిని హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై గంటకు 120 కి.మీ. వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారిని నిర్మించనున్నారు.
Also Read : విజయవాడ- హైదరాబాద్ మధ్య హైవే 6 లైన్లకు పెంపు !
రెండు నగరాల మధ్య ఉన్న నేషనల్ హైవే 556 కి.మీ.లతో నాలుగు వరుసల్లో అందుబాటులో ఉంది. ఇందులో తెలంగాణలో 190, ఆంధ్రప్రదేశ్‌లో 260, కర్ణాటకలో 106 కి.మీ.ల మేర విస్తరించింది. ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని మొదట అనుకున్నారు. కానీ హైస్పీడ్ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించడంతో కొత్త రహదారిని నిర్ణయిస్తున్నారు. ప్రస్తుత రహదారిని హైస్పీడ్‌కు తగినట్టు హైవే విస్తరణ సాధ్యం కాదని అధికారులు తేల్చడమే దీనికి కారణం.
బెంగళూరు హైదరాబాద్ రవాణా సౌకర్యాలు ఎంత మెరుగుపడితే… అంతగా అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ రహదారి నిర్మాణం సరికొత్త అవకాశాలకు కేంద్రం కానుంది.