హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని లగ్జరీ లిక్కర్ మార్ట్ టానిక్ వైన్ షాప్ ని ఎక్సైజ్ అధికారులు మూసి వేయించారు. ఈ దుకాణానికి ఉన్న లైసెన్స్ గడువు ఆదివారంతో ముగిసిపోయింది. లైసెన్స్ పొడిగించాలని దుకాణం యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సాధ్యం కాదని పొడిగించలేదు.. దీంతో ఎక్సైజ్ పోలీసులు వచ్చి మూసి వేయిచారు.
టానిక్ లిక్కర్ మార్ట్ స్పెషల్ జీవోతో గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బీఆర్ఎస్ లోని కొంత మది కీలక వ్యక్తుల బినామీ వ్యాపారమన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారిన లిక్కర్ దుకాణంలో సోదాలు నిర్వహిచారు. పన్నుల చెల్లింపులో అవకతవకలు జరిగినట్టు గుర్తించిన కమర్షియల్ టాక్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు టానిక్ లిక్కర్ మార్ట్ కు అనేక వెసులుబాట్లు గత ప్రభుత్వం. ఇచ్చింది. విదేశీ మద్యాన్ని అయినా తెచ్చుకునే వెసులుబాటు కల్పించింది.
టానిక్ వైన్స్ లో కోటిన్నరకు పైగా విలువ చేసి మద్యం ఉంటుంది అని అంచనా వేశారు. వాటిని సమీప షాపులకు పంపిస్తున్నారు. ప్రపంచంలోని ఎంత ఖరీదైన బ్రాండ్ మద్యం అయినా ఇక్కడ లభిస్తుంది. ఎక్కడి నుంచి అయినా మద్యం తెచ్చుకునే వెసులు బాటు కల్పించడంతో ఈ దుకాణం వ్యాపారం కోట్లలోనే సాగేది. మొత్తంగా టానిక్ ను మూతపడేలా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం .