నువ్వే మా నమ్మకం అంటూ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ల ఉద్యమాన్ని ప్రారంభింంచక ముందే మరో కొత్త ప్రచార ప్రణాళికను ఐ ప్యాక్ రెడీ చేసింది. దానికి ‘జగనన్నే మా భవిష్యత్తు’ అని పేరు పెట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు ఈ ప్రచారం చేస్తున్నామని చెబుతున్నారు. 20 నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో ప్రచారం చేపట్టనున్నట్లు వైఎస్ఆర్సిపి నేతలు చెబుతున్నారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, వాటి అమలును ఈ కార్యక్రమంలో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, పరిశీలకులతో ముఖ్యమంత్రి జగన్ ఇదే అంశంపై ప్రజెంటేషన్ ఇస్తారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు తమ నియోజకవర్గంలో రోజూ 25 నుంచి 30 ఇండ్లకు తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం ఈ కార్యక్రమంలో ప్రధాన. వాలంటీర్లతో కలిసి గృహ సారథులు ఇళ్లను సందర్శిస్తారు. సచివాలయం కన్వీనర్లతో పాటు గ్రామ, వార్డు వాలంటీర్లు అందరూ ఈ ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. పార్టీకి.. ప్రభుత్వానికి మధ్య తేడా లేకుండా చేయడంతో ఇప్పుడు ఉద్యోగులు కూడా పార్టీ పనులు చేయాల్సి వస్తోంది.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఏ మాత్రం క్లిక్ కాలేదని రిపోర్టులు రావడం అనేక సమస్యలు బయటకు రావడంతో ప్రత్యామ్నాయం.. ఇప్పుడు కేవలం పథకాల గురించి ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. ప్రతీ ఇంటి ఎదుట స్టిక్కర్ అంటించడంతో మాత… జగన్ వస్తేనే మళ్లీ భవిష్యత్ ఉంటుందని లేకపోతే ఉండదన్న నమ్మకాన్ని కలిగించాలనుకుంటున్నారు. మొత్తానికి వైసీపీ నేతల ప్రచార స్కీమ్స్ చూసి ప్రజలకు మాత్రం ఇదేం పిచ్చి అనుకునే పరిస్థితి వస్తోంది.