ప్రస్తుతం టాలీవుడ్లో వున్న టెర్రిఫిక్ డాన్సర్స్‌లో ఎన్టీఆర్ ఒకడు. చాలా రిస్కీ స్టెప్స్‌ను కూడా అవలీలగా చేసి కొరియోగ్రాఫర్లకు ఎంతో ఇష్టమైన హీరో అనిపించుకుంటున్న ఎన్టీఆర్ ఇక డాన్సులు చేయడం తన వల్ల కాదని చేతులెత్తేస్తున్నాడు. మెరుపులా కాళ్ళు కదిలిస్తూ తన స్టెప్పులతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని వెర్రెత్తించే ఎన్టీఆర్‌కి సడన్‌గా ఏమైంది? ఎందుకు డాన్సులు చెయ్యలేను అంటున్నాడు? ఆ వివరాల్లోకి వెళితే.. సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘నాన్నకు ప్రేమతో’ విడుదలవుతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను తెలిపేందుకు వెబ్‌సైట్స్‌కి ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన డాన్సుల గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ”16 నుంచి 25 సంవత్సరాల వరకు డాన్సులు చాలా ఇష్టంగా చేసేవాడిని. ఎలాంటి రిస్క్ అయినా తీసుకొని స్టెప్స్ వేసేవాడిని. కానీ, ఇప్పుడు నాకంత ఓపిక వుండడం లేదు. ఒక సినిమాలో 6 పాటలకు స్టెప్పులు వెయ్యాలంటే నరకం కనిపిస్తోంది. నాకు 45 ఏళ్ళు వచ్చేసరికి కాళ్ళు కూడా కదల్చలేని స్థితికి వచ్చేస్తానేమో అనిపిస్తోంది. ఒక సినిమాలో అన్ని పాటలకు డాన్సులు చెయ్యడం అనేది నాకు కొత్తగా అనిపించడంలేదు. అయితే సినిమాకి ఒక్క పాటకి మాత్రం టెర్రిఫిక్ డాన్స్ చెయ్యాలని వుంటుంది” అంటున్నాడు. ఎన్టీఆర్ అంటే డాన్స్, డాన్స్ అంటే ఎన్టీఆర్ అనే పేరు తెచ్చుకున్న ఈ యంగ్‌టైగర్ ఇప్పుడు డాన్సులు ఎందుకు చెయ్యలేకపోతున్నాడు? అనేది అందరికీ క్వశ్చన్ మార్క్‌గా మారింది. అప్పట్లో ఎన్.టి.రామారావు 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా స్టెప్పులు వేసి అభిమానుల్ని అలరించాడు. మరి ఈ కుర్ర ఎన్టీఆర్ 30 ఏళ్ళకే చతికిలబడిపోతే 50 ఏళ్ళు వచ్చేసరికి ఏమవుతాడో!