ఎవరి తండ్రి వారికి గొప్ప. ఆయన పేరు నిలబెట్టేలా చేయాలని ఎవరైనా అనుకుంటారు. అయితే ఆ ఖర్చు కూడా ప్రజల మీదే వేయాలనుకునేవాళ్లలో రాజకీయ నేతలు ఎక్కువగా ఉంటారు. కానీ అధికారుల్లోనూ అలాంటి తెలివి మీరిన వాళ్లు ఉన్నారని శ్రీలక్ష్మి లాంటి వాళ్లు తరచూ నిరూపిస్తూ ఉంటారు.
మచిలీపట్నంలో దాదాపుగా రెండున్నర కోట్ల ప్రజాధనంతో ఓ పార్క్ నిర్మించారు. దానికి యర్రా నాగేశ్వరరావు పార్క్ అని పేరు పెట్టారు. అందులో ఆయన విగ్రహం కూడా పెట్టారు. చాలా మందికి ఈ యర్రా నాగేశ్వరరావు ఎవరో తెలియదు. బహుశా పార్క్ కోసం భూమి ఇచ్చాడేమో.. లేకపోతే పార్క్ నిర్మాణానికి డబ్బులు ఇచ్చారేమో అనుకున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఆ యర్రా నాగేశ్వరారావు ఐఏఎస్ శ్రీలక్ష్మి తండ్రి . ఆమె మున్సిపల్ ఉన్నతాధికారిగా ఉంటూ డబ్బులు మంజూరు చేయించి మరీ పార్క్ కట్టించి తన తండ్రి విగ్రహం పెట్టించారు.
ఇప్పుడీ విషయం బయటకు తెలియడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. చిన్న వయసులోనే ఐఏఎస్ అయిన శ్రీలక్ష్మి నీతి, నిజాయితీగా ఉంటే ఆమె చీఫ్ సెక్రటరీ అయ్యే వారు. కానీ జగన్ తో చేతులు కలిపి ఆయన సీఎంగా లేనప్పుడు కూడా తప్పులు చేసి జైలుకెళ్లారు. పదహారు నెలలకుపైగా జైల్లో ఉన్నారు. అయినా మరోసారి జగన్ పంచన చేరి.. మూడేళ్ల పాటు అరాచకాలు చేశారు. ఇప్పుడు మరోసారి ఆమె పోస్టింగ్ లేకుండా ఉన్నారు. ఆమె చేసిన తప్పుడు ప నులకు ఎన్ని కేసులు పడతాయో తెలియని పరిస్థితి.
చేసిన నిర్వకాలకు తోడు.. తండ్రి పేరుతో పార్కులు కట్టుకోవడం లాంటి వ్యవహారాలూ బయటకు వస్తున్నాయి. ఐఏఎస్ లకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారో కానీ.. వీరు ఏమి నేర్చుకుంటారన్న ప్రశ్నలు… శ్రీలక్ష్మి లాంటి అధికారుల వల్ల ప్రజల్లో తరచూ వస్తూంటాయి.