కొద్ది రోజుల కిందట పేర్ని నాని హైదరాబాద్ రోడ్ల మీద కనిపించారు. ఆయన అక్కడ ఉన్నారని ఎవరికీ తెలియదు. ఆయన తాను కట్టిస్తున్న భవనం చూడటానికో.. వ్యాపార లావాదేవీ కోసమే రహస్యంగా అక్కడకు వచ్చారు. పక్కన గన్ మెన్లు కూడా లేరు. అయితే పేర్ని నాని రోడ్డు మీద కనిపించగానే కొంత మంది ఆయనకు తమదైన పద్దతిలో నిరసన తెలిపారు. దీంతో పేర్ని నాని వెంటనే కారెక్కి వెళ్లిపోయారు. తాజాగా ఖమ్మంలో అంబటి రాంబాబుకు అదే పరిస్థితి ఎదురయింది. బయట రాష్ట్రాల్లో వీరు కనిపిస్తేనే ప్రజలు ఇంత ఆగ్రహం చెందుతున్నారు ? ఏపీలో పోలీసులు, రౌడీయిజం, అదికారంతో కట్టడి చేస్తున్నారు కానీ.. రేపు ఇవన్నీ కోల్పోయాక.. వీరెవవరైనా సొంత రాష్ట్రంలో రోడ్డు మీదకు రాగలరా ? వీరు ఈ పరిస్థితి ఎందుకు సృష్టించుకున్నారు ?
నోటి దూల నేతలకు గడ్డు కాలం
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయడంలో వైసీపీలోని కొంత మంది నేతలు అన్ని హద్దులు దాటిపోయారు. చంద్రబాబు కుటుంబాన్ని,, పవన్ కల్యాణ్ కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టేస్తున్నారు. రాజకీయంగా విమర్శలు చేస్తే అంతా ప్రజాస్వామ్యం అనుకునేవారు. కానీ ఇక్కడ అది లేదు. అంతకు మించి రౌడీయిజం.. బూతుయిజం ఉంది. అలాంటి నేతలపై ఆయా పార్టీల సానుభూతిపరుల్లో పీకల మీద దాకా కోపం ఉంది. వారి అధికార పరిధి దాటి బయటకు వచ్చినప్పుడు అది బయట పడుతోంది. నిరసనలు ఎదుర్కొంటున్నారు.
అధికారం ఉన్నంత కాలం సేఫ్ !
ఏపీలో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. వారిని పల్లెత్తు మాట అన్నా పోలీసులతో కొట్టిస్తామని ఇప్పటికే చాలా సార్లు చేసి చూపించారు. తాము కొట్టినా కేసులుండవని పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. తాము తిడితే పడాలని తిరిగి తిట్టకూడదని రాజారెడ్డి రాజ్యాంగం చేశారు. వీటన్నింటితో ప్రజలు ఏపీలో కనిపించిన దగ్గర దాడి చేయడం లేదు. కానీ ఇది మరో నాలుగు నెలలు మాత్రమే. ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి. ..? ప్రభుత్వం మారిన తర్వాత వీరిలో ఒక్కరైనా ఏపీలో రోడ్డు మీదకు వచ్చి ధైర్యంగా తిరగలరా ?
అధికార అహంకారంతో కన్నూమిన్నూ కాన రాని నేతలకు కష్టమే !
అధికార అహంకారంతో కన్నూమిన్నూ కానరాకుడా ప్రతి ఒక్కరినీ తూలనాడిన వ్యవహారంలో పర్యవసానాలు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. కొన్నాళ్ల కిందట… జనసేన కార్యకర్తలకు ఎయిర్ పోర్టులో రోజాతో పాటు కొంత మంది మంత్రులు కనిపించారు. రోజా జనసేన పార్టీ కార్యకర్తలు మిడిల్ ఫింగర్ చూపించారు. దాంతో వారు కంట్రోల్ తప్పారు. పోలీసులు ఆపారు కాబట్టి కొంత మేర సర్దుకుని వెళ్లిపోయారు. తర్వాత దాడి చేశారని రోజా ఏడ్చినా ఆమె నిర్వాకమే హైలెట్ అయింది. అధికారం పోతే… ఇలాంటి వి అడ్డుకునే పరిస్థితి కూడా ఉండదు.
ఎలా చూసినా వైసీపీ ప్రమాదకరమైన రాజకీయం ప్రారంభించింది. అణిచివేత కోసం అన్ని టాక్టిక్స్ ప్రయోగించింది. కానీ అది నివురుగప్పిన నిప్పులా ఉంది. తమకు అవకాశం అందిన రోజున.. ప్రతీ దానికీ ప్రతీకారం తీర్చుకుంటారు. దానికి సూచనలు ముందే కనిపిస్తున్నాయి.