ప్రతీ సంగీత దర్శకుడికి ఒక కల ఉటుంది. తను స్వరపచిన ఏదైనా ఒక పాట పదికాలాలు నిలిచిపోవాలని. ఆ పాట వింటున్నప్పుడు మదిలో తనపేరు మొదలాలని. ఒక్కటికాదు.. అలాంటి వందలకొద్ది పాటలు సృస్టించేశారు మేస్ట్రో ఇళయరాజా. ఇళయరాజా పాట అంటే పాట కాదు. అదో బ్రాండ్. ఎన్ని ట్రెండ్లు మారినా.. ఇప్పటికీ ఎప్పటికీ ట్రెండీగా వుండే బ్రాండ్. సినీ సంగీత ప్రపంచంలో ఇళయరాజా సృస్టించిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా జయాపజయాలతో సంబధం లేకుండా పోస్టర్ పై ”ఇళయరాజా” అనే పేరు చూసి ప్రేక్షకుడు టిక్కెట్లు తెంచిన రికార్డ్ ఆయన సొంతం.
ఇళయరాజా పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత వత్తిడిలో వున్న ఆయన పాట వినిపిస్తే… మూడ్ చేంజ్ అయిపోయినా సందర్భాలు అనేకం వుంటాయి ఆ సంగీతాన్ని ఆస్వాదించే ప్రియులకు. మరి అలాంటి పాటలను స్వయంగా ఇళయరాజా లైవ్ లో వినిపిస్తే… ఈ ఛాన్స్ తెలుగు ఆడియన్స్ కు దొరికింది. నిన్న హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇళయరాజా లైవ్ కన్సర్ట్ జరిగింది. సంగీత ప్రియలను తన స్వర ఝారిలో ముంచెత్తారు ఇళయరాజా. దాదాపు యాబైమంది కళాకారులతో ఇళయరాజా నిర్వహించిన లైవ్ షో ఆద్యంతం ఆడియన్స్ ను అలరించింది. తెలుగులో ఇళయరాజా స్వరపచిన టాప్ హిట్స్ ను ఈ లైవ్ షోలో పెర్ఫారమ్ చేశారు.
ఇళయరాజా లైవ్ షో హైదరబాద్ లో జరగడం ఇదే తొలిసారి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఇళయరాజా తొలిసారి.. భాగ్యనగర వాసులను తన లైవ్ ట్రూప్ తో పలకరించారు. ఇళయరాజా సంగీతాన్ని అమితంగా ఇష్టపడే అభిమానులకు ఈ లైవ్ షో కొత్త అనుభూతిని ఇచ్చింది. లైవ్ ఆర్కెస్ట్రాతో ఆ పాటలు మళ్ళీ వినడం నిజంగా వండర్ ఫుల్ ఎక్స్ పిరియన్స్. ఇళయరాజాకు ఎంతో ఇష్టమైన ”జనని జనని” పాటతో మొదలైన ఈ లవ్ షోలో ప్రతి పాటను ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. మనో, చిత్ర, సాదన సర్గమ్, కార్తిక్.. లాంటి సినియర్ గాయనీ గాయకులు ఈ షోలో తమ గాత్రాన్ని వినిపించారు.
ఈ షోలో మరో స్పెషల్ మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఇళయరాజా ”హంగేరి సింఫనీ” ట్రూప్. నిజంగా అమేజింగ్ మ్యుజిషియన్స్. ఒక్క నోట్ కూడా తడబడకుండా పెర్ఫెక్ట్ గా ప్లే చేశారు. ఇళయరాజా పాటను లైవ్ లో ప్లే చేయడం అంత సులువు కాదు. ఆయన నొటేషన్ వినడానికి చాలా హాయిగా వున్నా.. లైవ్ లో ప్లే చేయడం కత్తిమీద సాము. ఒక్క నోట్ అటు ఇటు అయిన పాట ఫీల్ చెడుతుంది. ఈ విషయంలో ఇళయరాజా ఆర్కెస్ట్రా ట్రూప్ ను మెచ్చుకోవాల్సిందే. ఈ లైవ్ షోలో విన్న పాటలు ”ఇంటికి వచ్చి మళ్ళీ వినాలి” అనే ఫీలింగ్ కలిగించాయి.
ఇళయరాజా పాటలు చాల గ్రాండ్ గా వుంటాయి. అంత గ్రాండ్ వుండటానికి గల కారణం ఈ లైవ్ షో తో చాలా మంది ఆడియన్స్ కు తెలిసొచ్చిందనుకోవాలి. ”ఐదు నిమిషాల పాట కదా.. ఎదో ఒకటో తోసేద్దాం ” అనుకోలేదు ఇళయరాజా. ”ప్రతి పాట దేనికదే బ్రతకాలి. అలా ప్రాణం పోయాలి. అలాంటి స్వర రచన చేయాలి” అని అంకిత భావంతో ఇళయరాజా ఇన్నాళ్ళు పనిచేశారని ఈ లైవ్ షోని పరిశీలించి చూస్తే అర్ధం చేసుకోవచ్చు. 80,90దశకాల్లో సంగీత దర్శకుడు అంటే ఇళయరాజా పేరే వినిపించేది. పాట అంటే ఆయనదే. ఈ ఫీలింగ్ తీసుకురాడానికి ఆయన ఎలాంటి తపన పడ్డారో, ఆ డెప్త్ ఇవ్వడనికి ఎలాంటి కృషి చేశారో.. సంగీత వాయిద్యాలతో ఎలాంటి ప్రయోగాలు చేశారో.. ఈ లైవ్ షో ప్రత్యేక్షంగా చూపించింది. ఒకొక్క ఇంస్ట్రుమెంట్ గురించి ఇళయరాజా చెబుతుంటే.. దిని వెనుక ఇంత డెప్త్ వుందా? అనే సర్ ప్రైజ్ ఫీలింగ్ కలుగుతుంది. మొత్తమ్మీద తొలిసారి తన లైవ్ షోతో తెలుగు శ్రోతలను అలరించారు ఇళయరాజా. అన్నట్టు.. మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా విచ్చేసి ఈ లైవ్ షో ని ఎంజాయ్ చేయడం విశేషం.