గనుల శాఖలో చక్రం తిప్పి .. వేల కోట్ల దోపిడీలో ప్రత్యక్షంగా భాగమైన వెంకటరెడ్డి అనే అధికారిని సస్పెండ్ చేస్తూ… ఏసీబీ విచారణకు ఆదేశాలిచ్చారు. కానీ ఆయన అడ్రస్ లేడు. ప్రభుత్వం మారగానే ఆయనను తప్పించారు. ఇదే సందనుకుని ఆయన కనిపించకుండా పోయారు. ఆయన ఏపీ ఉద్యోగి కాదు. కనీసం ఐఏఎస్.. ఐపీఎస్.. ఐఆర్ఎస్ లాంటి క్యాడర్ కాదు. అసలు సంబంధమే లేని కోస్ట్ గార్డులో ఉద్యోగి. పేరు పక్కన రెడ్డి అని ఉంది.. తాము చెప్పినట్లుగా చేస్తారన్నక్రెడిబులిటీ ఉందని తెచ్చుకున్నారు. ఆయనతే చేయించుకోవాల్సినవి చేయించుకున్నారు.. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఆయన కు కొంత పెట్టి మిగిలినదంతా బొక్కేశారు. ఇప్పుడు ఆయన ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోయానని తెలుసుకుని పరారయ్యారు.
ఈ వెంకటరెడ్డి అతికి పరాకాష్ట చూపించేవారు. కోస్టు గార్డు ఉద్యోగానికి ఏపీలో గనులకు సంబంధం ఏమిటో ఎవరూ చెప్పలేరు. కానీ ఆయన మాత్రం అన్నీ చేయగలరు. చేసేశారు. కళ్ల ముందు కనిపించే తీవ్రమైన ఆరోపణల్ని ఎదుర్కోవాల్సిన సమయంలో… ఆయన మీడియా ముందుకు వచ్చి మన ప్రభుత్వం.. మన ప్రభుత్వం అని… ఆయన ఏదో వైసీపీ నేత అన్నట్లుగా మాట్లాడేవారు. ఆయన అరాచకం గురించి .. బరి తెగింపు చూసి మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయేవారు.
ఓ లిక్కర్ వాసుదేవరెడ్డి… ఐ అండ్ పీఆర్ విజయ్ కుమార్ రెడ్డి… గనుల వెంకటరెడ్డి ఇలాంటి వాళ్లందరూ ఇంతే. ఇతర కేంద్ర శాఖల నుంచి డిప్యూటేషన్లపై వచ్చి దోపిడీ చేసేశారు. వారిని వెంటనే పట్టుకోవాలి కానీ.. పారిపోయేదాకా చేసి.. సస్పెన్షన్ వేటు వేసి లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు. పై ముగ్గురిలో ఎవరూ అందుబాటులో లేరు. వెంకటరెడ్డి కి లుకౌట్ నోటీసులు జారీ చేసే ప్రయత్నాల్లో ఉంది.