యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు ఏపీలోనూ కనిపిస్తున్నాయి. దేశంలోని కొన్ని కంపెనీలు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే డమ్మీ బ్యాంకును అడ్డం పెట్టుకుని వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీల స్కాములను చేస్తున్న వైనాన్ని ఆర్టీవీ రవిప్రకాష్ ఇటీవల బయటపెట్టారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. మేఘా కంపెనీ ప్రధానంగా ఈ స్కామునకు పాల్పడిందని ఆయన బయట పెట్టారు. అయితే ఈ మేఘా కంపెనీతో పాటు రాఘవ అనే కంపెనీ కూడా అదే పని చేసింది. ఈ కంపెనీ ఏపీ సర్కార్ కు యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారంటీలు అంటగట్టింది.
రాఘవ గ్రూపు కంపెనీలు తెలంగాణకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందినవి. ఆయనకు తెలంగాణలో బీఆర్ఎస్ తో చెడిన తర్వాత అక్కడ పెద్దగా కాంట్రాక్ట్లు దక్కలేదు. కానీ ఏపీలో జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఏపీలోని జగన్ రెడ్డి హయాంలోని పెత్తందార్లలో ఒకరిగా మారిపోయారు. డబ్బులొచ్చే పనుల కాంట్రాక్టుల్లో ఆయన భాగమయ్యారు. అలాగే గనుల సీవరేజీ వసూళ్లను జిల్లాల వారీగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసింది గత ప్రభుత్వం . అలా వసూళ్లు చేసుకునే కాంట్రాక్టులను రాఘవ కన్స్ట్రక్షన్స్ పొందింది.
ఇందు కోసం దేశీయ బ్యాంకు గ్యారంటీలు సమర్పించాల్సి ఉంది. సమర్పించారు కూడా. తర్వాత యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి గ్యారంటీలు తెచ్చి సమర్పించి అసలు దేశీయ బ్యాంకు గ్యారంటీల్ని విడిపించుకుననారు. దీనికి పరారీలో ఉన్న కింగ్ పిన్ ఆఫీసర్ వెంకటరెడ్డి సహకరించారు. ఇప్పుడీ వ్యవహారం అధికార వర్గాలతో పాటు… పొంగులేటి క్యాంపులోనూ కలకలం రేపుతోంది. ఏపీ సర్కార్ ఏం చేయబోతోందో అన్నదానిపై పొంగులేటి వర్షం టెన్షన్ పడుతోంది.