రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి రెడీ అయిన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. ఔటర్, రీజనల్ రింగ్ రోడ్ల మధ్య ఓ పారిశ్రామిక సిటీని నిర్మించాలన్న ప్రణాళికలు సిద్దం చేసుకోంటోంది. పారిశ్రామీకరణతో ఉపాధి అవకాశాలు పెంచాలని భావిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అవకాశాలుబాగా పెరుగుతాయి.
హైదరాబాద్ కోటి మంది జనాభాను పెంచి పోషిస్తోంది. దీనికి కారణం ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉండటమే. చుట్టూరా అన్ని రకాల పరిశ్రమలు ఎంతో మందికి ఉపాధిని అందిస్తున్నాయి. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ సహా కొత్త కొత్త రంగాలు హైదరాబాద్ లో ఉపాధి చూపిస్తున్నాయి. రీజినల్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్కు సమీపంలో 25వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్యరహిత సిటీగా ఏర్పాటు చేయాలని హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవాలని సర్కార్ చర్యలు ప్రారంభించింది.
Read Also : హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !
ఇక ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పారిశ్రామిక కాలనీల్లో అన్ని రకాల వసతులు కల్పించేలా సర్కార్ చర్యలు తీసుకోనుంది. గతంలో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలతో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఇలాంటి క్లస్టర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మరింతగా విస్తరించనున్నాయి. ఇది రియాల్టీ రంగానికి బూస్టింగ్లా పనిచేయనుంది. ఇప్పటికే ఓఆర్ఆర్ సమీపంలో రియాల్టీ బిజినెస్ జోరుగా సాగుతోంది. ఓఆర్ఆర్ రేడియల్ రోడ్ల కనెక్టివిటీతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది.
ఉద్యోగులకు, కార్మికులకు సరిపడా ఇళ్ల నిర్మాణం అవసరం అవుతుంది. దీంతో ఓఆర్ఆర్ ప్రాంతంలో మరిన్ని నివాస, వాణిజ్య నిర్మాణాలు చేపట్టడంపై రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయి.