తమన్ మాంచి జోష్ లో వున్నాడు. వరస పెట్టి చార్ట్ బస్టర్ హిట్స్ ఇస్తున్నాడు. సామజవరగమనా, బుట్ట బొమ్మ పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. తర్వాత వకీల్ సాబ్ లో మగువ పాట కూడా బచార్ట్ బస్టర్. ప్రస్తుతం భీమ్లా నాయక్ పాట వైరల్ అవుతుంది. ఇప్పుడు బాలకృష్ణ- బోయపాటి అఖండ ఆల్బమ్ శ్రోతల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా తమన్ పంచుకున్న సరిగమలు..
వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ?
నిజానికి కరోనా ముందు రావాల్సిన సినిమాలు ఇవి. ఇప్పుడు అంతా ఓపెన్ అయ్యింది కాబట్టి వరుసగా వచ్చేస్తున్నాయి,
బాలకృష్ణ- బోయపాటి కలయికలో చేయడం ఎలా అనిపించింది ?
గొప్ప కాంబినేషన్. వాళ్ళు ఇంకా వందల సినిమాలు తీసినా ఫ్లాఫ్ తీయరు. వాళ్ళ అండర్ స్టాడింగ్ అంత గొప్పది.
అఖండ లో ఓకే చేసిన బీజీఎం ని మళ్ళీ చేయడానికి కారణం ?
సినిమా ప్రతి ఆరు నెలలకు అప్డేట్ అవుతుంది. మనం ఎక్స్ పెయిరీ ఫుడ్ తినం కదా. మొదటి చేసింది బావుంది. కానీ ఇంకా ఫ్రెష్ వుండాలంటే విడుదల తేదికి తగ్గట్టు వర్క్ చేయాలి. సినిమా కోసమే ఇక్కడ వున్నాం. దానికి కోసం ఎంత శ్రమ అయినా తీసుకోవాల్సిందే. సినిమా కోసం బ్రతుకుతున్నాం.
అఖండ ఎలా ఉండబోతుంది ?
ఈ సినిమాలో ఫైర్ ఉంది. ఇందులో ఎమోషన్ బాగుంటుంది. ఎమోషన్ బాగుంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతాయి. బాలయ్య గారు అదరగొట్టేశారు. ఇది పర్ఫెక్ట్ మీల్లాంటి సినిమా.
ఈ సినిమా కోసం స్పెషల్ గా ఏమైనా కేర్ తీసుకున్నారా ?
అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశాను. ఆ పాత్రలకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాం. చాలా బాగా వచ్చింది. ఈ కథ నెవ్వర్ బిఫోర్ అని.. నెవ్వర్ అగైన్ అని కూడా చెప్పొచ్చు. టైటిల్ సాంగ్ విని బాలయ్య మెచ్చుకున్నారు.
అఘోరా నేపధ్యం వున్న సినిమా కదా .. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
అఘోర అంటేనే సైన్స్. వాళ్లు అలా ఎందుకు మారుతారు? అనే విషయాలపై సినిమా ద్వారా క్లారిటీ వస్తుంది. దేవుడిని ఎందుకు నమ్మాలి అనే దాన్ని క్లారిటీగా చూపిస్తారు. ఈ సినిమాకు దాదాపు ఐదారు వందల మంది పని చేశారు. చాలా ప్రయోగాలు చేశాం. కేవలం సింగర్లే 120 మంది వరకు ఉంటారు. అఘోరాల గురించి చాలా రీసెర్చ్ చేశాం.
మ్యూజిక్ ఎక్కువ ఖర్చుతో కూడున్న వ్యవహారంగా మారింది. దినిపై మీ అభిప్రాయం ?
ఎక్కువ ఖర్చు అనేది నేను అంగీకరించను. ఒక్కో పాటకు ఒక్కోలా చేయాల్సి ఉంటుంది. శంకర్ మహదేవన్ పాడితే బాగుంటుందని అనుకుంటే.. ఆయనతోనే పాడిస్తాం. అంతే కానీ ఖర్చు తక్కువ అవుతుందని వేరే వాళ్లతో పాడించను. శివుడి మీద ఆయన ఎక్కువ పాటలు పాడారు. శివుడి గురించి ఆయనకు ఎక్కువగా తెలుసు. అందుకే ఆయనతో టైటిల్ సాంగ్ పాడించాం. అయితే ఎక్కువ ఖర్చు పెడితే క్యాలిటీ మ్యూజిక్ వస్తుందనే అభిప్రాయాన్ని మాత్రం ఒప్పుకోను.
అఖండ మ్యూజిక్ చేసినప్పుడు ఎంజాయ్ చేశారా ?
ఇలాంటి జానర్లో ఇదే నా బెస్ట్ వర్క్ అవుతుంది. కమర్షియల్ సినిమా అంటే అన్నీ స్పైసీగా ఉండాలి. కానీ ఇలాంటి చిత్రాలకు అది కుదరదు. టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసేందుకు దాదాపు ఓ నెల రోజులు పట్టింది. గొప్ప సన్నివేశం తరువాత ఆ పాట వస్తుంది.
ఈ మధ్య ప్రతి పాటకు ఒక ప్రమోషనల్ వీడియో చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎలా అనిపిస్తుంది ?
చాలా మంచింది. చాలా మంది సింగర్స్ తెరపై కనిపిస్తున్నారు. వాళ్ళ కష్టం. ఈ విషయంలో హీరోలకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు గొప్ప మనసుతో అంగీకరించి తమ పాటల్లో ముందుగా సింగర్స్ , మ్యుజిషియన్స్ కనిపించడానికి ఓకే చెబుతున్నారు. ఆడియో కంపనీల కూడా మంచి బిజినెస్ అవుతుంది.
దేవిశ్రీ ప్రసాద్ కంటే ఒక నెంబర్ ముందుకు వచ్చారా ?
నేను నంబర్ గేమ్‌ను నమ్మను. అది మైండ్‌లో ఉంటే పరిగెత్తలేం. నంబర్ రేస్ అనేది గుర్రాలకు ఉంటుంది. మనకు ఉండకూడదు. మనం రోజూ కష్టపడుతూ పని చేయాలి.
అల్ ది బెస్ట్
థ్యాంక్ యూ..