2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. సీజన్ 17 టైటిల్ విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ టీం నిలిచింది. ఇప్పుడు వరల్డ్ కప్ మినీ సంగ్రామానికి తెర లేస్తుంది. అయితే ఈసారి ఐపీఎల్ విజయం.. టీం ఇండియా వరల్డ్ కప్ జట్టులో ఓ లోటుని మిగిల్చింది. ఈసారి వరల్డ్ కప్ కి ఎంపికైన జట్టులో ఒక్క ప్లేయర్ కూడా ఈ ఐపీఎల్ టైటిల్ విన్నర్ జట్టులో లేడు. విన్నరే కాదు.. రన్నర్ గా నిలిచిన హైదరాబద్ టీం నుంచి కూడా ఎవరూ లేరు. నిజానికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు.
ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ కి ప్రత్యేక స్థానం వుంది. మేటి క్రికెటర్లు వున్న జట్లు లీగ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాయి. టైటిల్ గెలిచిన జట్టులో కనీసం ఒక్క ఇండియన్ స్టార్ ప్లేయర్ అయినా దేశానికి ప్రాతినిధ్యం వహించే జట్టులో ఉంటాడు. కానీ ఈసారి మాత్రం ఆ ట్రాక్ రికార్డ్ తప్పింది.
కోల్కతా కి టైటిల్ గెలిపించిన సారధి ఇండియన్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. టీట్వంటీలో తన ఫామ్ సరిగ్గా లేదనే నెపంతో ఈసారి జట్టులో తనకి చోటు దక్కలేదు. వరుణ్ చక్రవర్తి సీజన్ లో మంచి ఆట తీరు కనబరిచాడు. కానీ అతనకి మొండి చేయి చూపించారు సెలెక్టర్లు. ఇక హైదరాబద్ జట్టుపై ఎవరీ పెద్ద అంచనాలు లేవు. హెడ్, క్లాసన్, మక్రమ్ ఇలా విదేశీ స్టార్ ప్లేయర్స్ మెరిసే జట్టు ఇది. అయితే ఈ సీజన్ లో అభిషేక్ శర్మ అదరగొట్టాడు. వరల్డ్ కప్ కి జట్టు ప్రకటించే ముందే తన విద్వంసకరమైన ఆట తీరు చూపించాడు. కానీ సెలక్టర్లు అనుభవానికే పెద్దపీట వేశారు.
ఐపీఎల్ అన్ని దేశాల ఆటగాళ్ళకు ఓ వేదిక. ఆటగాళ్ళ బాలాలు, బలహీనతలపై మీటింగ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ లో చర్చ జరుగుతుటుంది. కప్ గెలిచిన జట్టు పాటించిన వ్యూహాలు కొన్నిసార్లు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి విన్నింగ్ జట్టు నుంచి ఒక్క ప్లేయర్ వున్నా ఎం తోకొంత అడ్వాన్టేజ్ వుండేది. కానీ ఈ సీజన్ ఐపిఎల్ లో ఆ ఉపయోగం లేకుండా పోయింది.
దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్, వెక్కిరింతలు నడుస్తున్నాయి. పాయింట్ల పట్టికలో చివర్లో వున్న ముంబై జట్టులోని నలుగురు ప్లేయర్లు టీమిండియా తరపున వరల్డ్ కప్ బరిలో దిగడం కూడా చర్చనీయంశమైయింది.
కాకపొతే జట్టుకి ఎంపికైన ఆటగాళ్ళు అంతా క్లాసిక్ ప్లేయర్స్. నిలబడితే సులువగా పరుగులు రాబట్టే నైపుణ్యం వున్నవాళ్ళు. అయితే ఎలాంటి ఫామ్ కొనసాగిస్తారనేదే ప్రశ్నార్ధకం.