ఆంధ్రప్రదేశ్లో వెయిటింగ్ జాబితాలోకి మరో ఐపీఎస్ అధికారి చేరారు. ఆయన పేరు సత్య ఏసుబాబు. గతంలో అనంతపురం ఎస్పీగా చేసి టీడీపీ నేతల్ని వైసీపీ నేతలు వేధిస్తూంటే.. ఎన్ని ఫిర్యాదులు చేసినా చూస్తూండిపోయారు. తాడిపత్రిలో చైతన్య అనే డీఎస్పీ చేసిన అరాచకాలన్నీ ఆయన కాలంలోనే. ఆయనకు ఇప్పుడు పోస్టింగ్ లేకుండా డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇప్పటికే పీఎస్సాఆర్ ఆంజనేయులు దగ్గర నుంచి పీవీ సునీల్ కుమార్ వరకూ చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. వీరంతా ఖాళీగా ఉండకుండా.. మళ్లీ వైసీపీకి ఊడిగం చేసే పనులు చేస్తున్నట్లుగా ఆధారాలు లభించడంతో… ఆఫీస్ టైమ్లో ఆఫీసులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా వీరితో పాటు సత్య ఏసుబాబాబు జత కలిశారు. వీరంతా కలిసి బయట రాజకీయాలు కూడా చేస్తున్నారు. తమ పరిచయం ఉన్న ఇతర ఐపీఎస్ అధికారులు.. రిటైరైపోయిన వారితో వారికి మద్దతుగా పోస్టులు పెట్టించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పీవీ సునీల్ కుమార్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కు స్నేహితుడు కావడంతో ఆయన కోసం తరచూ పోస్టులు పెడుతున్నారు. దానికి రాజకీయ వ్యాఖ్యలు జోడిస్తున్నారు. ఇవన్నీ ఈ ఐపీఎస్ అధికారులపై మరింత కఠినంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించేందుకు అవకాశం ఏర్పడుతోంది. గీత దాటిన కొంత మందిపై కేసులు పెట్టి అరెస్టులు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు.