బాలీవుడ్ నటి కాదంబరి జెత్వాని కేసు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఓ బడా పారిశ్రామిక వేత్త కోసం ఐపీఎస్ లను సజ్జల రంగంలోకి దింపి జెత్వాని, ఆమె ఫ్యామిలీని ముప్పు తిప్పలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై తాజాగా జెత్వాని ఏపీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
నాడు సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి ఆదేశాల మేరకే సీనియర్ ఐపీఎస్ లు జెత్వానిని వేధించారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అయినా సజ్జల మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు సాహసించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి సజ్జలను కూటమి సర్కార్ టార్గెట్ చేస్తోందని.. ఈ కేసుతో సజ్జలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే ఈ ఇష్యూపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో త్వరలోనే ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జలకు నోటీసులు అందటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఆయనకు అప్పుడే అరెస్ట్ భయం పట్టుకుందని.. అందుకే సజ్జలకు మద్దతుగా అంబటి హడావిడిగా మీడియా సమవేశం ఏర్పాటు చేశారని అభిప్రాయం వినిపిస్తోంది.
అయితే , ఈ కేసుతో సజ్జలకు ఎలాంటి సంబంధం లేదని అంబటి చెప్తూనే.. జెత్వాని ఓ మాయ లేడి అంటూ విమర్శలు గుప్పించడం గమనార్హం.