ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు చెప్పుకోలేని బాధ వెంటాడుతోంది. ప్రభుత్వంపై పోరాడతామని చెబుతున్నారు. పోరాటాలు కూడా చేస్తున్నారు. కానీ ఎవరూ పట్టిచుకోవడం లేదు. అందరూ వైసీపీకి పరోక్ష మిత్రపక్షమేగా అని తేల్చేస్తున్నారు. మిగతా సమయాల్లో ఏమో కానీ ఇప్పుడు జేపీ నడ్డా పర్యటనకు వస్తున్నారు. ఆయన ప్రభుత్వాన్ని ఓడిస్తామంటే ప్రజలు సీరియస్‌గా తీసుకోరేమో అని ఆందోళన చెందుతున్నారు. అందుకే విష్ణువర్ధన్ రెడ్డి తెర ముందుకు వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి జగన్ డ్రామాలేస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీలో బీజేపీకి మద్దతిస్తానన్నట్లుగా మాట్లాడుతున్నారని ఇటు వంటి డ్రామాలు ముఖ్యమంత్రి గతంలో కూడా ఆడారన్నారు. డైవర్ట్ పాలిటిక్స్‌తో సీఎం మాయ చేస్తున్నారని, పొలిటికల్ మైండ్ గేమ్‌ను వైసీపీ ప్రారంభించిందన్నారు. బీజేపీ పెద్దలతో అన్నీ మాట్లాడినట్లు చెప్పుకుంటారని, కానీ ఆ వివరాలు ఏవీ కూడా మీడియాకు చెప్పరని, ఏపీలో బీజేపీపై జగన్ చేస్తున్న కుట్ర అని అంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తాపత్రయం అంతా.. నడ్డా వచ్చి బీజేపీపై విమర్శలు చేస్తే.. అందరూ తేలిగ్గా తీసుకోకుండా… నిజంగానే.. నమ్మండి అని చెప్పడాకన్నట్లుగా ఉంది.
ఇప్పటికే వైసీపీకి బీజేపీకి కేంద్ర స్థాయిో మంచి సపోర్ట్ ఉందని.. అనేక రకాలుగా బయటపడుతోంది. రాష్ట్ర స్థాయిలో పార్టీని నడుపుతున్న వారంతా అదే పనిలో ఉన్నారని పవన్ కూడా భ ావిస్తున్నారు. ఇలాంటి సమయంలో జేపీ నడ్డా పర్యటన తో తాము వైసీపీకి వ్యతిరేకం అనిప్రజలను నమ్మించాలనుకుటున్నారు. 2024లో బీజేపీ, జనసేన కలిసే అధికారంలోకి వస్తాయని ఆయన చెబుతున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉంటే బీజేపీ ఉన్నట్లే కదా అని ఇతరులు వేస్తున్న సెటైర్లను ఎలాగోలా కవర్ చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.