ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. షర్మిల తాను ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుండగా..జగన్ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వొద్దని వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు పడుతున్నాయని ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా..వైసీపీ ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఇండియా కూటమిలోని కీలకమైన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొనడం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ఇండియా కూటమికి మద్దతు తెలిపితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురు అవుతాయి. అలా కాదని కామ్ గా ఉంటే సొంత సోదరి తనకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఇది జగన్ కు ఏమాత్రం రుచించడం లేదు. తనకు నష్టం జరిగినా పరవాలేదు కానీ, తనతో విబేధించిన షర్మిల ఎదుగుదలను జగన్ అసలు జీర్ణించుకోలేరని..జగన్ మనస్తత్వం తెలిసిన నేతలు చెబుతున్న మాట ఇది. అందుకే జగన్ ప్లాన్ మార్చి ఇండియా కూటమి వైపు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
Also Read :ఇండియా కూటమిలోకి జగన్… అఖిలేష్ తోనే రాయబారం?
ఇండియా కూటమి వైపు వెళ్తున్నట్లు సంకేతాలు ఇస్తే బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడమే కాదు..భవిష్యత్ లో కాంగ్రెస్ ఫేవర్ కోరవచ్చు అనే వ్యూహంతో జగన్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారనే విశ్లేషణలు వినబడుతున్నాయి. ఒకవేళ ఎన్డీయే ఆగ్రహానికి గురి కావాల్సి వస్తే ఎలాగూ ఇండియా కూటమి నుంచి మద్దతు లభిస్తుందన్న ఆలోచనతో ఉన్నారని అంటున్నారు.
అప్పటి పరిస్థితుల ఆధారంగా జగన్ ..కాంగ్రెస్ కు మరింత చేరువ అయ్యే అవకాశం లేకపోలేదని..అదే జరిగితే తాను కోరుకున్న విధంగా షర్మిలను కాంగ్రెస్ లో బలహీనపరిచినట్లు అవుతుందనే జగన్ ఈ స్ట్రాటజీ మెయింటేన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.