అబ్బబ్బో..వైసీపీ అధికారం కోల్పోగానే శాంతి భద్రతలు గాడి తప్పాయంటూ జగన్ గుండెలు బాదుకునేంత పని చేశారు. రెడ్ బుక్ పేరిట పాలన కొనసాగిస్తూ వైసీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని ఆరోపించారు. ఇక, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రామిస్ చేసిన జగన్ లండన్ వెళ్తుండటం క్యాడర్ ను నివ్వెరపరుస్తోంది.
రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పితే ప్రతిపక్షంగా వైసీపీ ఉద్యమాలు చేపట్టాలి. అందుకు జగన్ నాయకత్వం వహించాలి..రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో క్యాడర్ కు, ప్రజలకు భరోసా కల్పించాలి. అందుకు సిద్దమేనని సిగ్నల్స్ ఇచ్చేసిన జగన్.. అందుకు విరుద్దంగా తరుచుగా బెంగళూరు వెళ్ళడం మళ్లీ ఇంతలోనే ఫారిన్ వెళ్లేందుకు సిద్దం కావడం వైసీపీ శ్రేణులను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
Also Read : వైసీపీపై జగన్ ఆశలు వదిలేసుకున్నారా?
శాంతి భద్రతలపై ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టిన జగన్.. అక్కడి నుంచి వచ్చాక కూడా అదే మాటను వినిపించారు. ఈ అంశంపై కూటమి సర్కార్ ను ఎండగడుతామని గంభీరమైన ప్రకటనలు చేసిన జగన్..లండన్ పర్యటనకు సిద్దమయ్యారు. అంటే కూటమి అధికారం చేపట్టాక రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ చేసిన వాదనలు అవాస్తమేనని జగన్ అంగీకరించినట్లే కదా అనే అభిప్రాయం వినిపిస్తోంది.
జగన్ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదని.. అందుకు జగన్ లండన్ టూర్ ను ఉదహరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.