కర్ణాటక బీజేపీ.. అక్కడి ప్రభుత్వం కేటీఆర్‌పై అసహనంతో ఉంది. కేటీఆర్‌ను దెప్పి పొడిచేందంుకు వచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తాజాగా… నీతి ఆయోగ్ ప్రకటించిన ఇన్నోవేషన్ ర్యాంకుల్లో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. దీనిపై కర్ణాటక బీజేపీ కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఇప్పుడేమంటారు అని ప్రశ్నించింది. గతంలో నేరుగా మంత్రే కేటీఆర్‌పై ఇలా విరుచుకుపడ్డారు. తమకు వచ్చిన పెట్టుబడులను.. తెలంగాణకు వచ్చిన పెట్టుబుడల లెక్క చూపిస్తూ… ఎవరు గొప్పో డిసైడ్ చేసుకోవాలన్నారు.
నీతి ఆయోగ్ ప్రకటించిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2022’ ర్యాంకుల్లో కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ‘డియర్ కేటీఆర్ గారూ.. మీకిది తెలుసా? ప్రపంచమంతా కర్ణాటకలో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతోంది. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. ఇంతకీ మీ బుజ్జగింపు రాజకీయాలు ఎలా కొనసాగుతున్నాయి?’ అంటూ పోస్ట్ చేసింది. నిజానికి ఈ ర్యాంకుల్లో తెలంగాణ ఎక్కడో లేదు. రెండో స్థానంలోనే ఉంది. అంటే కర్ణాటకకు పోటీ ఇస్తున్నట్లే.
కర్ణాటక బీజేపీ.. అక్కడి మంత్రులు కేటీఆర్‌పై విరుచుకుపడటానికి కారణాలు ఉన్నాయి. బెంగళూరులో మౌలిక సదుపాయాలు మెరుగ్గా లేవంటూ..హైదరాబాద్‌కు తరలి రావాలని ఐటీ, అంకుర కంపెనీలను గతంలో కేటీఆర్ ఆహ్వానించారు. బెంగళూరులో ట్రాఫిక్, నీటి కొరతపై అసహనం వ్యక్తం చేసిన ఓ వ్యాపారవేత్త వార్త మీడియాలో రావడంతో ఆయన ఇలా చేశారు. అంతకు ముందు అమెరికా పర్యటనలోనూ బెంగళూరును తక్కువ చేసి అక్కడ ఏమీ లేదని హైదరాబాద్ బాగుందని నేరుగానే చెప్పారు. ఈ పరిణామాలను మొదట కర్ణాటక బీజేపీ పట్టించుకోలేదు కానీ.. తర్వాత సీరియస్‌గా తీసుకుంది.