సమంత – నాగ చైతన్య విడిపోయి మూడేళ్లు అవుతున్నా ఈ జంట ఎందుకు విడిపోయిందో ఇప్పటికీ వారికి తప్ప ఎవరికీ తెలియదు. ఇందుకు గల కారణాలను వీరిద్దరూ కూడా బయట పెట్టలేదు. దీంతో ఎవరికీ వారుగా సామ్- చైతూల విడాకులకు కారణం ఇదేనంటూ ఏవేవో కథలను అల్లేస్తుండటం కామన్ గా మారింది.
సినిమాలో సామ్ బోల్డ్ గా నటించడం అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదని ఈ విషయం ఆమె దృష్టి తీసుకెళ్లగా…తన లైఫ్ కు సంబంధించి ఆంక్షలు పెడితే తన దారి తను చూసుకుంటానని చెప్పడమే విడాకులకు కారణం అని, అటు సామ్ కు తెలియకుండా చైతూ వేరొక అమ్మాయితో సంబంధం కలిగి ఉండడమే ఈ డివోర్స్ కు దారితీసిందన్న పుకార్లు వినిపించాయి. ఎప్పుడు వీరి విడాకుల గురించి వచ్చినా సోషల్ మీడియా షేక్ అవుతునే ఉంటుంది.
ఆ మధ్య తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ లో ఛానెల్ లో సామ్ – చైతూల విడాకులకు ఫోన్ ట్యాపింగే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనక బీఆర్ఎస్ కు చెందిన ఓ పెద్ద రాజకీయ నేత ఉన్నారని ఆరోపించడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. దీంతో సమంత ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు..?ఎవరా ఆ లీడర్..?ఎందుకు ఆమె ఫోన్ ట్యాప్ చేయాల్సి వచ్చిందని పొలిటికల్ , ఫిలిం సర్కిల్లో జోరుగా చర్చ జరిగింది.
ఇటీవల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సరికొత్త సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ట్యాపింగ్ ఎపిసోడ్ పై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపిస్తూ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. సమంత – నాగ చైతన్య విడాకులకు సైతం ఫోన్ ట్యాపింగే కారణమని ఆరోపించడం సంచలనంగా మారింది.
అప్పట్లో మల్లన్న, ఇప్పడు బూర నర్సయ్యలు సమంత – చైతూల విడాకులకు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూనే కారణమని ఆరోపించడంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.