తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రూటు మార్చారు. దారుణమైన తిట్లతో వివాదాస్పద రాజకీయం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు కానీ.. ఆయనకు ప్రశాంత్ కిషోర్ అందించడం ప్రారంభమైందని కొంత మంది అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్కు పీకే టీం పని చేయబోతోందని.. ఈ మేరకు గతంలో ఓ సారి ప్రగతి భవన్లో సమావేశం అయ్యారన్న ప్రచారం జరిగింది. దానికి అధికారిక ప్రకటన రాలేదు. పీకేకు చెందిన ఐ ప్యాక్ కూడా టీఆర్ఎస్ కోసం పని చేస్తున్నట్లుగా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కానీ పీకేతో ఒక్క సారి కాదని.. ఇటీవల ఢిల్లీ పర్యటనల్లో కూడా కేసీఆర్ భేటీ అయ్యారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఆయన సలహాలతోనే ఉద్రిక్తతలు పెంచేలా తిట్ల రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపిస్తున్నారు. పీకే మార్క్ రాజకీయాలు ఎలా ఉంటాయో.. కేసీఆర్ కూడా అచ్చంగా అదే రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారన్న అనుమానం తెలంగాణ రాజకీయాల్లో సహజంగానే వ్యక్తమవుతోంది. ఏపీలో వైసీపీకి పీకే సేవలు అందిస్తున్నారు. అక్కడ ఎంత దారుణమైన రాజకీయాలు తయారయ్యారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. చివరికి చట్ట సభల్లోనూ కుటుంబసభ్యుల్ని మహిళల్ని కించ పరుస్తున్నారు. ఆ స్థాయిలో రచ్చ అయ్యేలా కిషన్ రెడ్డిని కేసీఆర్ తిట్టారు.
అంత దారుణంగా తిట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా పీకే చలువేనని.. పదవి కాపాడుకునేందుకు కేసీఆర్ దిగజారిపోతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. నిజంగానే కేసీఆర్.. టీఆర్ఎస్ కు లేదా మరో తెలంగాణ పార్టీకి పీకే వ్యూహాలు చెప్పడం ప్రారంభిస్తే.. ఇక తెలంగాణ రాజకీయాలు మరింత దిగజారడం ఖాయమని అనుకోవచ్చన్న ఆందోళన సాధారణ ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది.